మధ్యప్రదేశ్‌లోని యువ క్రీడాకారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆసియా గేమ్స్, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి.. డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ క్రీడా అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ మేరకు శివరాజ్ స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్ గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ వారిని.. క్రీడల్లోకి రాకుండా చేస్తున్నారని సీఎం అన్నారు.
క్రీడాకారుల భవిష్యత్ భరోసా కల్పించేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసి భారత హాకీ జట్టు కాంస్య సాధించడంలో కీలకంగా వ్యవహరించిన మధ్యప్రదేశ్ ఆటగాడు వివేక్ ప్రసాద్‌ను డీఎస్పీగా నియమించినట్లు సీఎం అన్నారు. అంతేగాక భోపాల్‌లో కోటి రూపాయలు విలువైన ఇంటిని వివేక్‌కు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర క్రీడా అనురాగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ సీఎంతో కలిసి వచ్చే ఏడాది జరగనున్న 5వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ క్రీడలు మధ్యప్రదేశ్‌లో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 11వరకూ జరగనున్నాయి.
ఇదీ చూడండి: వందో టెస్టులో వార్నర్ రికార్డు సెంచరీ.. దిగ్గజాల సరసన చోటు