ETV Bharat / sports

రిటైర్మెంట్​ విషయంలో తొందరపడ్డానేమో!: సానియా మీర్జా

author img

By

Published : Jan 26, 2022, 12:18 PM IST

Sania Mirza Retirement: రిటైర్మెంట్​ ప్రకటించడంపై తాను పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పింది భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా. నిర్ణయం సరైనదే అయినా ప్రకటించినా సమయం సరైనది కాదని, భావిస్తున్నట్లు పేర్కొంది.

Sania Mirza Retirement
Sania Mirza Retirement

Sania Mirza Retirement: భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా.. ఈ సీజన్​ తర్వాత ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్లు​ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపై తాను పశ్చాత్తాప పడుతున్నట్లు వెల్లడించింది. నిర్ణయం సరైనదే అయినా ప్రకటించినా సమయం సరైనది కాదని, ఆ విషయంలో తొందరపడినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అందరూ తన ఆట గురించి కాకుండా రిటైర్మెంట్​ గురించే మాట్లాడుతున్నారని, అడుగుతున్నారని చెప్పింది.

"ఆఖరి సీజన్​ అయినంత మాత్రాన నా ఆటలో, ఆలోచనా ధోరణిలో మార్పు ఉండదు. ప్రతి మ్యాచ్​ గెలవాలనే లక్ష్యంతోనే బరిలో దిగతాను. ఫలితం ఎలా వచ్చినా ఆటను ఆస్వాదిస్తూనే 100 శాతం శ్రమిస్తాను. ఈ ఏడాది చివర్లో ఏం జరగబోతుందనే దాని గురించి అస్సలు ఆలోచించడం లేదు."

-సానియా మీర్జా, టెన్నిస్​ ప్లేయర్​.

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా మంగళవారం జరిగిన మిక్స్​డ్ డబుల్స్ క్వార్టర్​ఫైనల్ పోటీల్లో​ కుబ్లర్ జోడీ చేతిలో 6-4, 7-6 తేడాతో సానియా మీర్జా జోడీ ఓడిపోయింది. ఫలితంగా ​ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సానియా.. తన కెరీర్​లో ఆరు గ్రాండ్​స్లామ్​లు గెలిచింది. వీటిలో మూడు టైటిల్స్​ మహిళల డబుల్స్​ కాగా.. మరో మూడు మిక్స్​డ్​ డబుల్స్​లో సాధించింది. 2003 నుంచి ఆడుతున్న ఈమె 2013 నుంచి సింగిల్స్​ ఆడటం మానేసింది. అప్పటి నుంచి డబుల్స్​ మాత్రమే ఆడుతోంది. అంతర్జాతీయంగా ఆమె 68వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

సానియా మీర్జా సంచలన నిర్ణయం.. ఆటకు వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.