ETV Bharat / sports

జీరో గ్రావిటీలో ఫుట్​బాల్ మ్యాచ్​.. అదిరిపోయే గోల్ కొట్టిన స్టార్ ప్లేయర్​

సాధారణంగా ఫుట్​బాల్​ అంటే మైదానంలో ఆడతాం. కానీ ఓ ఫుట్​బాల్​ టీమ్​ గాల్లో ఆడి రికార్డుకెక్కింది. అదేంటి గాలిలో ఆడటమేంటి అనుకుంటున్నారా? ఆ సంగతులు తెలుసుకుందాం..

Luis Figo scores goal
అంతరిక్షంలో ఫుట్​బాల్ మ్యాచ్​
author img

By

Published : Sep 27, 2022, 4:54 PM IST

జీరో గ్రావిటీ అంటే గాలిలో తేలుతామన్న విషయం తెలిసిందే. అయితే ఇదే జీరో గ్రావిటీలో ఓ ఫుట్​బాల్ టీమ్​​ మ్యాచ్​ ఆడి గిన్నిస్​ రికార్డుకెక్కింది. ఎలా అంటే.. ఔట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పేరిట ఓ మ్యాచ్​ నిర్వహించారు. అంటే దీని అర్థం ప్రపంచం బయట ఆడటం. ఇందులో భాగంగా ఏడుగురు ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తుకు పంపించారు. జీరో గ్రావిటీలోకి వెళ్లాకా విమానం లోపల ఏర్పాటు చేసిన 75 స్క్వేర్‌ మీటర్ల పిచ్‌పై మ్యాచ్‌ ఆడారు.

వీరిలో పోర్చుగీస్​ స్టార్​ ఫుట్​బాలర్​ లూయిస్ ఫిగో పాటు మిడిల్‌ఈస్ట్‌, యూరోప్‌, లాటిన్‌ అమెరికాలకు చెందిన మహిళా, పురుషుల ఫుట్‌బాలర్స్‌ పాల్గొన్నారు. ఈ ఏడుగురు రెండు జట్లుగా విడిపోయారు. రెడ్‌ టీమ్‌కు ఫిగో నాయకత్వం వహించగా.. టీమ్‌ ఎల్లోకు మరొకరు కెప్టెన్సీ వహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ఈ వీడియోలో ఫిగో కొట్టిన గోల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్​లో రెడ్‌ టీమ్‌ 2-1 తేడాతో టీమ్‌ ఎల్లోపై విజయం సాధించింది. కాగా, జీరో గ్రావిటీలో తొలిసారి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడి గిన్నిస్‌ రికార్డులో ఈ ప్లేయర్స్​ స్థానం సంపాదించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మూడోసారి భారత్​-పాక్ ఢీ.. మ్యాచ్​కు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.