భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు దిల్లీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఛత్రశాల్ స్టేడియంలో జరిగిన గొడవలో సాగర్ రానా అనే మల్లయోధుడు మరణించాడు. ఈ దాడుల్లో సుశీల్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు బాధితుడు ఒకరు వెల్లడించాడు.
గత కొన్ని రోజులుగా బృందాలుగా ఏర్పడి సుశీల్ కోసం వెతుకుతున్న పోలీసులకు.. అతని జాడ లభ్యం కాలేదు. దీంతో తాజాగా అతడి కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.
అసలేం జరిగింది?
ఛత్రసాల్ స్టేడియంలో మంగళవారం(ఈ నెల 4న) రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇందులో మల్లయోధులు సాగర్, సోను, అమిత్ల బృందంపై.. సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇందులో సాగర్ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటన స్థలంలో కొన్ని వాహనాలతో పాటు ఓ గన్ లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించి మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చదవండి: 'ఈ హత్య కేసులో రెజ్లర్ సుశీల్దే ప్రధానపాత్ర!'
బాధితుల వాంగ్మూలం ప్రకారం.. ఈ హత్య కేసులో సుశీల్ ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు. స్టేడియంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: గొడవల్లో రెజ్లర్ మృతిపై సుశీల్ కుమార్ క్లారిటీ