ETV Bharat / sports

ఫ్లాయిడ్‌ ఉదంతంపై గళం విప్పిన క్రీడాలోకం - Minneapolis Floyd news

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్న వేళ.. అతడికి సంతాపం తెలిపింది క్రీడా లోకం. జాతి వివక్షతపై మండిపడింది. ఫార్ములావన్‌ రేసర్లు, క్రికెట్, గోల్ఫ్, బాక్సింగ్, ఫుట్‌బాల్‌ వర్గాలు ఘటనను తీవ్రంగా ఖండించాయి.

racism in sports
ఫ్లాయిడ్‌ ఉదంతంపై గళం విప్పిన క్రీడాలోకం
author img

By

Published : Jun 3, 2020, 8:30 AM IST

Updated : Jun 3, 2020, 8:52 AM IST

అమెరికాలో ఓ పోలీస్‌ కిరాతక చర్యతో ప్రాణాలు వదిలిన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతంపై క్రీడా ప్రపంచం గళం విప్పుతోంది. ఇప్పటికే అమెరికా టెన్నిస్‌ తార కొకో గాఫ్‌, వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ ఈ ఉదంతం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వర్ణ వివక్ష ఆందోళన వ్యక్తం చేయగా.. తాజాగా వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులు స్వరం కలిపారు. అమెరికన్‌ గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌ వుడ్స్‌.. ఫ్లాయిడ్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఈ విషాదాంతంలో పోలీసులు గీత దాటారన్నది స్పష్టంగా తెలుస్తోందని అతనన్నాడు.

వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డారెన్‌ సామి స్పందిస్తూ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా క్రికెట్‌ ప్రపంచం గళం విప్పాల్సిన సమయం ఇదని అన్నాడు "నా సోదరుడు పాదం కింద నలిగిన వీడియో చూశాక ఓ వర్గం ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా క్రికెట్‌ ప్రపంచం నిలవని పక్షంలో మీరు కూడా ఈ అన్యాయంలో భాగమైనట్లే" అని సామి పేర్కొన్నాడు.

మరోవైపు ఐరోపా ఫుట్‌బాల్‌ స్టార్లు ఎంతో మంది వర్ణ వివక్షను ఖండిస్తూ నిరసన గళం వినిపించారు. గత నెల 25న ఓ శ్వేత జాతీయుడైన పోలీస్‌ అధికారి.. ఓ కేసుకు సంబంధించి పట్టుబడ్డ ఫ్లాయిడ్‌ పట్ల అమానుషంగా ప్రవర్తించగా.. అతను ప్రాణాలు వదిలాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి రావడం వల్ల అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.

అంత్యక్రియల ఖర్చు నేను భరిస్తా: జార్జ్‌ ఫ్లాయిడ్‌ అంత్యక్రియల ఖర్చు భరించడానికి అమెరికా దిగ్గజ బాక్సర్‌ ఫ్లాయిడ్‌ మేవెదర్‌ ముందుకొచ్చాడు. ఈ నెల 9న జరగనున్న ఫ్లాయిడ్‌ అంత్యక్రియల ఖర్చుతో పాటు అతడి స్మారకంగా ఏర్పాటు చేసే ఇతర కార్యక్రమాలకు కూడా నిధులు సమకూరుస్తానని మేవెదర్‌ ప్రకటించాడు. ఇందుకు ఫ్లాయిడ్‌ కుటుంబం కూడా అంగీకరించింది.

ఇవీ చూడండి:

  1. 'వివక్షకు వ్యతిరేకం.. వైవిధ్యానికి ప్రతిరూపం'
  2. తర్వాత చనిపోయేది నేనేనా?: కోకో గాఫ్​ ఆవేదన
  3. 'క్రికెట్​లోనూ జాతి వివక్ష ఉంది.. నేనే బాధితుడిని'

Last Updated : Jun 3, 2020, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.