ETV Bharat / sports

కొరియా ఓపెన్​లో సింధు, శ్రీకాంత్​కు నిరాశ.. సెమీస్​లో ఓటమి - పీవీ సింధు ఓటమి

korea open badminton 2022 PV Sindhu: కొరియా ఓపెన్​లో భారత స్టార్​ షట్లర్లు ఇంటిదారి పట్టారు. సెమీఫైనల్లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​ ఓటమి పాలయ్యారు.

Sindhu fails to decode An Seyoung
పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​
author img

By

Published : Apr 9, 2022, 10:07 AM IST

Updated : Apr 9, 2022, 1:58 PM IST

korea open badminton 2022 PV Sindhu: కొరియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో భారత స్టార్​ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. మంచి ఫామ్​తో టైటిల్​ వేట మొదలు పెట్టిన సింధుకు సెమీఫైనల్​లో దక్షిణాఫ్రికాకు చెందిన రెండోసీడ్​ క్రీడాకారిణి అన్​ సెయంగ్(An Seyoung) షాక్​ ఇచ్చింది. అన్​ సెయంగ్​ ధాటికి సింధు నిలువలేకపోయింది. రెండు వరుస సెట్లలో ఓటమితో కొరియా ఓపెన్​ను ముగించింది.

Sindhu fails to decode An Seyoung
పీవీ సింధు

నేడు(శనివారం) జరిగిన కొరియా ఓపెన్​ సూపర్​ 500 బ్యాడ్మింటన్​ టోర్మమెంట్​ సెమీఫైనల్​లో దక్షిణాఫ్రికా క్రీడాకారిణి అన్​ సెయంగ్​తో సింధు తలపడింది. సుమారు 48 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో వరుస సెట్లలో 14-21, 17-21 తేడాతో ఓటమిపాలైంది. దీంతో పతకం ఏమీ లేకుండానే ఇంటిబాట పట్టింది. సింధు.. అన్​ సెయంగ్​పై వరుసగా నాలుగోసారి ఓటమి చెందడం గమనార్హం. ​

శ్రీకాంత్​ కూడా: మరోవైపు పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్​ కూడా సెమీస్​లో ఓడాడు. ఇండోనేసియాకు చెందిన జొనాథన్​ క్రిస్టీ చేతిలో 21-19, 21-16 తేడాతో ఓడిపోయాడు. ఈ మ్యాచ్​ సుమారు 50 నిమిషాల పాటు సాగింది. ఇంతకుముందు ఇద్దరూ తలో నాలుగు మ్యాచ్​ల్లో నెగ్గగా.. ఇప్పుడు క్రిస్టీ శ్రీకాంత్​పై పైచేయి సాధించాడు. గతనెలలో స్విస్​ ఓపెన్​లోనూ సెమీఫైనల్లో క్రిస్టీ చేతిలోనే ఓడి టోర్నీ నుంచి అవుటయ్యాడు కిదాంబి.

ఇదీ చూడండి: మరో టైటిల్​ వేటలో దూసుకెళ్తున్న సింధు.. సెమీస్​లో శ్రీకాంత్​

Last Updated : Apr 9, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.