బీసీసీ భారత స్పోర్ట్స్ 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్నారు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి. 15 ఏళ్ల వయసులోనే అతిచిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన హంపికి అత్యధిక మంది అభిమానుల ఓట్లు లభించాయి. ఈ ఏడాదికి అవార్డు నామినేషన్లలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ప్రింటర్ ద్యుతి చంద్, షూటర్ మను బాకర్, హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్ నిలిచారు.
ఈ ఏడాదికి జీవిత సాఫల్య పురస్కారం సీనియర్ అథ్లెట్ అంజు బాబీ జార్జ్‌ను వరించింది. 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకుంది యువ షూటర్ మను బాకర్.
ఇదీ చూడండి: 'సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది'