ETV Bharat / sports

ట్రయల్స్ నిరాకరించిన 'కంబళ వీరుడు' శ్రీనివాస గౌడ

స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​) నిర్వహించే ట్రయల్స్​లో పాల్గొనలేనని కంబళ పోటీదారుడు శ్రీనివాసగౌడ తెలిపాడు. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న కంబళ పోటీల్లో మరిన్ని ఘనతలు సాధించాలన్న కారణంతో మరో నెల గడువు అడగాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అయితే తాజాగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప.. శ్రీనివాస గౌడను సోమవారం ఘనంగా సత్కరించారు.

Karnataka - Kambala Srinivasa gowda felicitated by CM yeddyurappa
కంబళ వీరుడు శ్రీనివాస గౌడను సత్కరించిన యడీయూరప్ప
author img

By

Published : Feb 17, 2020, 10:15 PM IST

Updated : Mar 1, 2020, 4:10 PM IST

శ్రీనివాస గౌడను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం అభినందించారు. అతడి కార్యాలయానికి పిలిపించి శాలువాతో సత్కరించి రూ.3 లక్షల నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస గౌడ మాట్లాడుతూ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) నిర్వహించే ట్రయల్స్‌లో ఇప్పుడే పాల్గొనని, దానికి కొంత సమయం కావాలని తెలిపాడు.

కంబళ వీరుడు శ్రీనివాస గౌడను సత్కరించిన యడియూరప్ప

‘‘సాయ్‌ నిర్వహించే ట్రయల్స్‌లో నేను పాల్గొనలేను. కంబళలో మరిన్ని ఘనతలు సాధించాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం కంబళ టోర్నమెంట్‌ సాగుతోంది. అందుకే ఒక నెల గడువు కావాలని సాయ్‌ను కోరాలని భావిస్తున్నా. అయితే కంబళ, అథ్లెట్స్‌ పాల్గొనే ట్రాక్స్‌ రెండూ వేరుగా ఉంటాయి. ట్రాక్స్‌లో వేళ్ల మీద పరిగెత్తితే, కంబళలో మడమల మీద పరిగెత్తుతాం. ఒక దానిలో రాణించేవారు వారు మరో దానిలో అంతగా సత్తాచాటలేరు. ట్రాక్స్‌ ఈవెంట్స్‌లో రాణించిన ఎంతో మంది సంప్రదాయ క్రీడల్లో విజయవంతం కాలేకపోయారు. ఇంతలా ప్రఖ్యాతి చెందుతానని ఎప్పుడూ అనుకోలేదు. దీనిలో నా దున్నపోతులదే కీలకపాత్ర. అయితే అందరూ ఉసేన్‌ బోల్ట్‌తో నన్ను పోలుస్తున్నారు. ఆయన ప్రపంచ ఛాంపియన్‌. నేను కేవలం బురద వరి పొలాల్లో పరిగెత్తేవాడిని’’.

- శ్రీనివాస గౌడ, కంబళ పోటీదారుడు

ఇటీవల జరిగిన కంబళ పోటీల్లో జమైకా వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును తలదన్నేలా పరుగులు తీసి సంచలనం సృష్టించాడు శ్రీనివాస గౌడ. దున్నపోతులతో కలిసి 142.5 మీటర్ల దూరాన్ని గౌడ 13.62 సెకన్ల సమయంలో ఛేదించాడు. ఆ విధంగా 100 మీటర్లను కేవలం 9.55 సెకన్లలోనే పూర్తిచేశాడు. అయితే 100 మీటర్ల పరుగులో బోల్ట్‌ సాధించిన 9.58 సెకన్లే ప్రపంచ రికార్డుగా ఉంది. కానీ బోల్ట్‌ కంటే శ్రీనివాస 0.3సెకన్లు ముందే పూర్తి చేయడం వల్ల అందరీ దృష్టి ఆకర్షించాడు. ఫలితంగా క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అతడికి ట్రయల్స్‌ నిర్వహించాల్సిందిగా సాయ్‌ కోచ్‌లను ఆదేశించారు.

ఇదీ చూడండి.. 'కన్నడ బోల్ట్​'కు ఖరారు కాని ట్రయల్​ తేదీ

Last Updated : Mar 1, 2020, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.