ETV Bharat / sports

చెస్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ కపూర్ - ఏఐసీఎఫ్​ అధ్యక్షుడు సంజయ్​ కపూర్

ఏఐసీఎఫ్​ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సంజయ్ కపూర్​. పదిహేనేళ్లలో చెస్​ సమాఖ్యకు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.​

Kapoor elected president, Chauhan secretary of national chess body
చెస్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్
author img

By

Published : Jan 5, 2021, 7:32 AM IST

అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అధ్యక్షుడిగా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. భరత్ సింగ్ చౌహాన్ కార్యదర్శి పదవిని నిలబెట్టుకున్నారు. అంతర్జాలం వేదికగా సమాఖ్యకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు.

ఉత్తర్​ప్రదేశ్ చెస్ సంఘం నుంచి పోటీ చేసిన సంజయ్.. రెండు ఓట్ల తేడాతో వెంకట్రామ రాజాపై నెగ్గారు. సంజయ్​కు 33ఓట్లు రాగా.. రాజాకు 31ఓట్లు వచ్చాయి. భరత్​.. రవీంద్రపై 35-29 తేడాతో గెలిచారు.

2005 నుంచి ఏఐసీఎఫ్​కు ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి. పదిహేనేళ్లుగా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా సాగింది.

ఇదీ చూడండి: భారత 67వ గ్రాండ్​మాస్టర్​గా లియోన్ ​మెండోన్కా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.