ETV Bharat / sports

బట్లర్‌ జెర్సీ వేలం.. కరోనాపై పోరుకు సాయం - 2019 world cup

మధుర స్మృతులను ఎవరూ పోగొట్టుకోవాలని అనుకోరు. కానీ ఇంగ్లాండ్​కు చెందిన క్రికెటర్ జోస్​ బట్లర్​ గతేడాది ప్రపంచకప్పులో ధరించిన జెర్సీని వేలం వేసి లక్షలాది రూపాయిలు రాబట్టాడు. ఏంటీ ఇలా చేశాడు అనుకుంటున్నారా? ఇదంతా కరోనాపై పోరాటానికి అండగా నిలిచేందుకేనట.

josbuttler is auctioning his World Cup final shirt to raise funds for helps Covid-19 victims
బట్లర్‌ జెర్సీ వేలం.. కరోనాపై పోరుకు సాయం
author img

By

Published : Apr 9, 2020, 7:03 AM IST

ప్రపంచకప్‌ విజయాన్ని ప్రతి ఒక్క క్రికెటర్‌ ఏంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ ప్రపంచకప్‌లో ధరించిన జెర్సీలను అపురూపంగా దాచుకుంటారు. కానీ ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ మాత్రం గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ధరించిన జెర్సీని వేలం వేసి దాదాపు రూ.61 లక్షలు రాబట్టాడు. అయితే ఇదంతా కరోనాపై పోరాటానికి అండగా నిలిచేందుకే. వేలం ద్వారా వచ్చిన ఈ డబ్బును అతను స్థానిక రాయల్‌ బ్రాంప్టన్‌, హారిఫీల్డ్‌ ఆసుపత్రులకు అందించనున్నాడు. నిరుడు ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం చేయడంతో పాటు అతను సూపర్‌ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచిన ఆ మ్యాచ్‌లో వేసుకున్న జెర్సీని గతవారం అంతర్జాలంలో వేలం పెట్టగా గడువు ముగిసే సమయానికి మొత్తం 82 బిడ్లు వచ్చాయి. దాంట్లో అత్యధిక మొత్తం వేసిన వాళ్లకు జెర్సీ దక్కింది.

josbuttler is auctioning his World Cup final shirt to raise funds for helps Covid-19 victims
బట్లర్‌ జెర్సీ వేలం.. కరోనాపై పోరుకు సాయం

హాకీ ఇండియా.. ఇంకో రూ.21 లక్షలు

హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కరోనాపై పోరాటానికి ఇదివరకే ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ప్రకటించిన హెచ్‌ఐ.. తాజాగా ఒడిషా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.21 లక్షల విరాళమిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. ఆ రాష్ట్రంలో కరోనా బారిన పడ్డవాళ్ల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఈ సాయాన్ని ప్రకటించినట్లు హెచ్‌ఐ తెలిపింది.

ఇదీ చూడండి: జడేజాను కాపీ కొట్టిన వార్నర్.. ఎందుకోసమో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.