టీమ్ ఇండియాలో కీలక పాత్ర పోషిస్తున్న యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్‌పై దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో సామర్థ్యమున్న ఈ ఫాస్ట్ బౌలర్‌ను పాక్ ఆటగాడితో పోల్చి ఒత్తిడికి గురిచేయకూడదని సూచించాడు.
"టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్ల ఎదుగుదల ఎంతో వేగంగా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రాను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అతడిలాగే అర్ష్‌దీప్ అందుకు మరో ఉదాహరణ. అతడు గొప్పగా నేర్చుకోగలడు. కఠినమైన మైదానాల్లోనూ అదరగొడతాడు. బాల్‌ను స్వింగ్ చేయగలడు. పవర్‌ప్లేలో రాణిస్తాడు. వికెట్లు తీయడంలో వసీం అక్రమ్‌లాగే ఎంతో నియంత్రణ చూపుతాడు. కానీ పాక్ మాజీ కెప్టెన్ అయిన వసీం స్వింగింగ్‌కి పెట్టింది పేరు. అర్ష్‌దీప్‌ను అతడితో పోల్చి చూడలేం. మంచి భవిష్యత్తు ఉన్న ఇలాంటి ఆటగాళ్లను వేరొకరితో పోల్చడం అంటే వారిని మరింత ఒత్తిడికి గురిచేయడమే అవుతుంది" అని జాంటీ వివరించాడు. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో పాల్గొనడంపై స్పందిస్తూ యువ క్రికెటర్లకు ఇదొక గొప్ప అవకాశమని అన్నాడు. భారత టీ20 లీగ్‌లో పంజాబ్ జట్టుకు జాంటీ రోడ్ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.