కరోనా వైరస్‌తో సంబంధం లేకుండా 2021 జులై 23నే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని జపాన్ ప్రధాన మంత్రి యోషిండే సుగా స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదా పడ్డాయి. ఈ క్రీడల్ని సవరించిన తేదీల్లోనే యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇటీవలి కాలంలో జపాన్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఒలింపిక్స్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో సుగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాను త్వరలోనే నియంత్రణలోకి తీసుకొస్తామని.. అందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైరస్‌పై గెలిచామని చెప్పడానికి ఒలింపిక్స్ నిర్వహణే తమ ధ్యేయమని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే నెల నుంచి వైరస్ వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.
ఇదీ చూడండి : 'అనుకున్న సమయానికే ఒలింపిక్స్'