ETV Bharat / sports

ఒలింపిక్స్​లో ఆ రూల్.. కండోమ్ తయారీదారుల నిరాశ - టోక్యో ఒలింపిక్స్​ కండోమ్స్​

టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో భారీగా డిమాండ్ ఉండే ప్రీమియం కండోమ్​ల వాడకంపై ఒలింపిక్​ నిర్వాహక కమిటీ ఆంక్షలు విధించింది. దీంతో ఈసారి వాటి వాడకం దాదాపు ఉండకపోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. అదే జరిగితే తమ రంగం తీవ్రంగా నష్టపోక తప్పదని కండోమ్​ తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒలింపిక్స్​ లాంటి విశ్వక్రీడల్లో కండోమ్​ల అవసరం ఏముంది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

tokyo olympics, condom makers
టోక్యో ఒలింపిక్స్, కండోమ్ తయారీదారులు
author img

By

Published : Jun 25, 2021, 3:46 PM IST

Updated : Jun 25, 2021, 6:39 PM IST

మరికొద్ది రోజుల్లో జరగబోయే టోక్యో ఒలింపిక్స్​లో ప్రీమియమ్​ కండోమ్​ల వాడకంపై నిర్వాహకులు పలు నిబంధనలు విధించారు. కరోనా నేపథ్యంలో అథ్లెట్లు భౌతిక ధూరం పాటించడం సహా ఒలింపిక్​ విలేజ్​లోనూ కండోమ్​ల వాడకానికి వీలుండదని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది అథ్లెట్లకు కండోమ్​ల పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఒలింపిక్​ విలేజ్​లో కండోమ్​లను నిషేధిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒలింపిక్స్​కు కండోమ్​లను సంబంధం ఏమిటి? అసలు ఈ మెగా ఈవెంట్​లో కండోమ్​లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు? వాటిని క్రీడాకారులకు పంపిణీ చేయాల్సిన అవసరం ఏముంది? గతంలో జరిగిన ఒలింపిక్స్​లో ఒక్కో అథ్లెట్లకు ఎన్ని కండోమ్​లు ఇచ్చారనే విషయాలను ఓ సారి చూద్దాం.

ఎప్పటి నుంచి ఇస్తున్నారు?

1988లో సియోల్​ వేదికగా జరిగిన ఒలింపిక్స్​లో తొలిసారి అథ్లెట్లకు కండోమ్​లను పంపిణీ చేశారు నిర్వాహకులు. క్రీడల్లో భాగంగా ఒత్తిడిని జయించడానికి, సురక్షిత శృంగారంతో పాటు హెచ్​ఐవీ/ఎయిడ్స్​ వ్యాధి అవగాహనలో భాగంగా ఆటగాళ్లకు కండోమ్​లను ఇవ్వాలని నిర్ణయించారు. దాదాపు రెండు వారాలకు పైగా జరిగే ఈ ఈవెంట్​లో విభిన్న దేశాలకు చెందిన అథ్లెట్లు టోర్నీలో పాల్గొంటారు. సమ్మర్​ ఒలింపిక్స్​తో పాటు వింటర్​ మెగా ఈవెంట్లలోనూ కండోమ్​లను పంచడం అప్పటి నుంచి మొదలైంది.

తొలిసారిగా సియోల్​ వేదికగా జరిగిన సమ్మర్​ ఒలింపిక్స్​లో 8,500 కండోమ్​లను ఆటగాళ్లకు పంపిణీ చేశారు. 1992లో అల్బర్ట్​ విల్లే వేదికగా జరిగిన వింటర్​ ఒలింపిక్స్​లో 30 వేల కండోమ్​లను వాడారు. సాల్ట్​ లేక్​ సిటీ వేదికగా 2002లో జరిగిన వింటర్​ గేమ్స్​లో తొలిసారి లక్ష కండోమ్​లను ఉపయోగించారు. 2004 ఎథెన్స్​ సమ్మర్​ ఒలింపిక్స్​లో లక్షా 30వేల కండోమ్​లను వాడారు.

ఇదీ చదవండి: OLYMPICS: ద్యుతి, హిమకు చివరి అవకాశం!

అత్యధికం అదే..

2016 రియో ఒలింపిక్స్​లో 4 లక్షల 50వేల కండోమ్​లు ఉపయోగించారు. ఒలింపిక్స్​ చరిత్రలో రియోలోనే ఎక్కువ కండోమ్​లు అమ్ముడుపోయాయి. ఈ మెగా ఈవెంట్​లో 14 వేలకు పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో లక్ష కండోమ్​లు మహిళలకు సంబంధించినవి. 2012లో లండన్​ వేదికగా జరిగిన ఒలింపిక్స్​లో వాడిన వాటి కంటే 3 రెట్లు అధికంగా బ్రెజిల్​లో వాడారు. వీటితో పాటు లక్షా 75వేల లూబ్రికేంట్స్​ అమ్ముడయ్యాయి.

ఇస్తాం.. కానీ, వాడొద్దు..

టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్​లో మొత్తం 11 వేల పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ సారి అథ్లెట్లకు కేవలం 1.6 లక్షల కండోమ్​లను మాత్రమే అందించనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. అదే సమయంలో కొవిడ్ నిబంధనల్లో భాగంగా ఇతరులతో భౌతిక సంబంధాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ ఈవెంట్​లో ఇచ్చిన కండోమ్​లను క్రీడా గ్రామంలోనే వాడమని ఉద్దేశంతో కాదని.. అవి అవగాహనలో భాగంగా ఇచ్చేవేనని నిర్వాహకులు తెలిపారు. వాటిని ఆటగాళ్లతో పాటే సొంత దేశాలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కరోనా ఇబ్బందులు లేకుంటే ఈ సారి రియో ఒలింపిక్స్​ కండోమ్​ల సంఖ్యను మించే అవకాశాలు ఉండేవి!

ఒలింపిక్స్​ సమయంలో ఇంతగా డిమాండ్​ ఉన్న కండోమ్​ల పంపిణీపై ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఆంక్షలు విధించడం వల్ల తయారీదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే విదేశీ అభిమానులు ఈ ఆటలకు దూరమయ్యారు. దీంతో ఈ సారి తమ వ్యాపారం సాఫీగా సాగదని తెలిసి కండోమ్​ తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: అక్కడికి వెళ్లే అథ్లెట్ల కోసం 1.6 లక్షల కండోమ్​లు

Last Updated : Jun 25, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.