ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌ను భారత్ ఘనంగా ముగించింది. ఆదివారం చివరగా జరిగిన ట్రాప్ టీమ్ ఈవెంట్లో మన పురుషుల బృందం స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 6-4 తేడాతో కజికిస్థాన్పై విజయం సాధించింది. మన బృందంలో పృథ్వీరాజ్ తొండైమన్, లక్ష్య సియోరన్, క్యనన్ చెనై ఉన్నారు.
ఇదే విభాగంలో మన మహిళా బృందం కూడా బంగారు పతకం సొంతం చేసుకుంది. కజికిస్థాన్పై 6-0 తేడాతో విజయం సాధించింది. మన టీమ్‌లో శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి, మనీషా కీర్ ఉన్నారు.
అంతకు ముందు 25 మీటర్ల రాపిడ్ ఫైర్ టీమ్ ఈవెంట్లో మన పురుషుల బృందం వెండి పతకం సాధించింది. ఇందులో విజయ్‌వీర్ సిద్ధు, గుర్ప్రీత్ సింగ్, ఆదర్శ్ సింగ్ ఉన్నారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ పోటీలో యూఎస్ఏ టీమ్‌పై 10-2 తేడాతో గెలిచింది.