ETV Bharat / sports

ఒలింపియన్స్​ కరోనా టీకా వేయించుకోండి: ఐఓసీ

ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులు కరోనా వ్యాక్సిన్​ను వేయించుకోవాల్సిందిగా కోరారు ఐఓసీ అధ్యక్షుడు థామస్​ బాచ్​. అయితే ఇదేం తప్పనిసరేం కాదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం అథ్లెట్ల నిర్ణయానికే వదిలేశామని తెలిపారు.

ioc
ఐఓసీ
author img

By

Published : Jan 28, 2021, 7:34 AM IST

ఒలింపిక్స్​ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ(ఐఓసీ). ఈ క్రమంలోనే ఈ మెగాక్రీడల్లో పాల్గొనే ఒలింపిక్స్​, పారాఒలింపిక్స్​ క్రీడాకారులు.. కరోనా టీకా వేయించుకోవాలని కోరింది.

టోక్యో సహా 2022 బీజింగ్​ వింటర్​ గేమ్స్​ను భద్రతగా నిర్వహించే విషయమై నేషనల్​ ఒలింపిక్​ కమిటీలు(ఎన్​ఓసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ​(డబ్ల్యూహెచ్​ఓ)తో సంప్రదించారు ఐఓసీ అధ్యక్షుడు థామస్​ బాచ్​.​ ఇందులో భాగంగానే క్రీడాకారులు, ఇతర సిబ్బంది రక్షణను దృష్టిలో పెట్టుకుని కరోనా జాగ్రత్త చర్యలు, నిబంధనలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను తయారుచేసినట్లు వెల్లడించారు. ఇమిగ్రేషన్ విధానాలు, క్వారంటైన్​, వైరస్​ టెస్టులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, కాంటాక్ట్​ ట్రేసింగ్​, వ్యాక్సినేషన్​ సహా పలు అంశాలు ఇందులో ఉన్నాయి.

ఇందులో భాగంగానే ఈ మెగాక్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్​ సహా ఇతర సహాయక సిబ్బంది కరోనా వ్యాక్సిన్​ను తీసుకోవాల్సిందిగా కోరింది ఐఓసీ. కానీ ఇది తప్పనిసరి కాదని వెల్లడించింది.

ఇదీ చూడండి : ఒలింపిక్స్​ నిర్వహణ కోసం 'ఐఓసీ' రూల్ బుక్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.