వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే ఒలింపిక్స్ చూసేందుకు, ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వ క్రీడల చూడటం కోసం జపాన్ వచ్చే సందర్శకులకు టీకాలను వేయడానికి ఒలింపిక్ పాలకమండలి గొప్ప ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.
రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధానమంత్రి యోషిహిదే సుగాతో పాటు విశ్వక్రీడల నిర్వాహకులతో థామస్ బాచ్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఒలింపిక్స్ నిర్వహకులపై బాచ్ ప్రశంసలు కురిపించారు.
నవంబరు నెల ప్రారంభంలో టోక్యో నాలుగు దేశాల జిమ్నాస్టిక్స్ పోటీని విజయవంతంగా నిర్వహించింది. కరోనా తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం ఇదే.