ETV Bharat / sports

Olympics: ఓవైపు కరోనా కేసులు.. మరోవైపు మార్గదర్శకాలు - ఒలింపిక్స్​ పతకాల ప్రదానోత్సవం

కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒలింపిక్స్(Tokyo Olympics)​ పతకాల ప్రదానోత్సవంలో పలు మార్పుల చేసింది ఐఓసీ. ఈ కార్యక్రమంలో పాటించాల్సిన కరోనా జాగ్రత్తల మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ మెగాటోర్నీ నిర్వహణను సందిగ్ధంలో పడేస్తూ జపాన్​లో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Jul 15, 2021, 5:22 PM IST

ఒలింపిక్స్(Tokyo Olympics) విజేతలకు అందించే​ ప్రతకాల ప్రదానోత్సవంలో పాటించాల్సిన కరోనా నిబంధనలపై మార్గదర్శకాలను విడుదల చేసింది ఐఓసీ. అథ్లెట్లు, మెడల్​ ప్రెజెంటేటర్స్, వాలంటీర్స్​​ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. గ్రూప్​ ఫొటోలు దిగకూడడని స్పష్టం చేసింది. విజేతలు పతకాలు తీసుకునేటప్పుడు భౌతిక దూరం పాటించడానికి వీలుగా వేర్వేరు వేదికలు(పోడియాలు) ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

"ప్రెజెంటేటర్స్​ అందరూ వ్యాక్సిన్​ వేయించుకువాలి. ఒక్కో ఈవెంట్​లో ఐఓసీ సభ్యుడు, అంతర్జాతీయ ఫెడరేషన్​ తరఫున ఒక్కరే ఉండాలి. కరోనా నేపథ్యంలో ప్రతిఒ​​క్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలి."

-ఐఓసీ.

ఈ మెగాక్రీడల్లో సాధారణంగా గెలుపొందిన అథ్లెట్లకు మెడల్స్​ను వారి మెడలో వేసి సత్కరిస్తారు. అయితే ఈసారి కరోనా కారణంగా పతకాలను ఓ ట్రేలో తీసుకురాగా, క్రీడాకారులు స్వయంగా తమ పతకాలను మెడలో వేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. కరచాలనం, ఆలింగనం వంటివి కూడా ఉండవని స్పష్టం చేశారు.

ఆరు నెలల గరిష్ఠానికి

ఒలింపిక్స్​కు ఆతిథ్యమివ్వనున్న టోక్యో నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(జులై 15) కేసులు సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 21న 1,485 కేసులు రాగా.. ఆ తర్వాత రికార్డు స్థాయిలో గురువారం 1,308 కొత్త కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది.

ఇదీ చూడండి: Olympics: త్వరలో ఒలింపిక్స్.. మరోవైపు భారీగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.