ETV Bharat / sports

Olympic Day: అసలు ఒలింపిక్ డే ఎప్పుడు మొదలైంది? - స్పోర్ట్స్ న్యూస్

అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. మన దేశం తరఫున ఇప్పటివరకు పోటీల్లో పాల్గొన్న వారికి, మరికొన్ని రోజుల్లో టోక్యో ఒలింపిక్స్​ బరిలో దిగనున్న క్రీడాకారులకు విషెస్ చెప్పారు. ఇంతకీ ఈ ఒలింపిక్ డే ఎప్పుడు మొదలైంది? దీని చరిత్రేంటి?

International Olympic Day 2021
ఒలింపిక్ డే
author img

By

Published : Jun 23, 2021, 9:07 AM IST

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఒలింపిక్స్​ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులతో పాటు చాలామంది ప్లేయర్లు కూడా ఎదురుచూస్తుంటారు. గతేడాది జులై 23న జరగాల్సిన ఈ మెగాక్రీడలు.. కరోనా కారణంగా ఏడాది వాయిదాపడ్డాయి. అయితే ఆ పోటీలకు సరిగ్గా నెలరోజుల ముందు అంటే బుధవారం(జూన్ 23) ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే(International Olympic Day) జరుపుకోనున్నారు. అసలు ఒలింపిక్ డే ఎప్పుడు మొదలైంది?

International Olympic Day 2021
టోక్యో ఒలింపిక్స్ 2021

ఒలింపిక్ డే చరిత్ర

1894 జూన్ 23న పారిస్​ సోర్బెన్​లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని(International Olympic Committee) స్థాపించారు. అందుకు గుర్తుగా ప్రతి ఏడాది ఈ రోజున జాతీయ ఒలింపిక్ కమిటీలు.. ఒలింపిక్ డేను నిర్వహిస్తాయి.

ఐఓసీ చెక్​స్లోవేకియా సభ్యుడు డాక్టర్. జోసెఫ్ గ్రస్.. వరల్డ్ ఒలింపిక్​ డే గురించి 1947లో స్టాక్​హోమ్​లో జరిగిన భేటీలో ఒలింపిక్ డే గురించి రిపోర్ట్ సమర్పించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన 42వ ఐఓసీ సమావేశంలో.. జూన్ 23ను 'ఇంటర్నేషనల్​ ఒలింపిక్ డే'గా జరుపుకోవాలని సభ్య దేశాలు తీర్మానించాయి.

  • Today, on Olympic Day, I appreciate all those who have represented India in various Olympics over the years. Our nation is proud of their contributions to sports and their efforts towards motivating other athletes.

    — Narendra Modi (@narendramodi) June 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • In a few weeks, @Tokyo2020 begins. Wishing the very best to our contingent, which consists of our finest athletes. In the run up to the games, here is an interesting quiz on MyGov. I urge you all, specially my young friends to take part. https://t.co/De25nciIUZ

అంతర్జాతీయ ఒలింపిక్ డే 2021 ప్రాముఖ్యం

కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలు.. శారీరకంగా, మానసికంగా చాలావరకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో మన ఆరోగ్యం కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతో ముఖ్యం.

ఒలింపిక్​ డేను నామమాత్రానికే వదిలేయకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయ ఒలింపిక్ కమిటీలు.. అన్ని రకాల ప్రజలను ఆకర్షించేందుకు ఒలింపిక్స్ కోసం విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.