ETV Bharat / sports

Olympics: హిమదాస్​కు గాయం.. ఒలింపిక్స్​కు కష్టమేనా? - జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ హిమదాస్

టోక్యో ఒలింపిక్స్​లో భారత్ అథ్లెట్ హిమదాస్​ పాల్గొనేది అనుమానంగా కనపిస్తోంది. జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న సమయంలో ఆమెకు గాయం కావడమే కారణం.

Hima
హిమదాస్
author img

By

Published : Jun 26, 2021, 2:41 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో బెర్తు కోసం శ్రమిస్తున్న భారత అథ్లెట్ హిమదాస్​కు నిరాశపరిచే వార్త! జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో 100 మీటర్ల హీట్ విభాగంలో పోటీ పడుతుండగా ఆమె కాలికి గాయమైంది. గాయం తీవ్రత తెలియాల్సి ఉంది.

Hima
హిమదాస్

శనివారం జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ టోర్నీలో 100 మీ హీట్​ మూడో రౌండ్​లో 12.01 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది హిమ. తద్వారా ఫైనల్​కు అర్హత సాధించింది. ఈ పోటీల్లోనే గాయంతో ఇబ్బందిపడింది. తద్వారా శనివారం సాయంత్రం జరగనున్న తుదిపోరులో ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే భారత 4x100 మీ మహిళ రిలే టీమ్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది. ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన బృందంలో ద్యుతిచంద్, ధనలక్ష్మి, అర్చన సుసీంద్రన్​తో పాటు హిమ కీలక సభ్యురాలు.

ఇవీ చూడండి: Olympics: 20 సెకన్ల ఆలస్యం.. ఒలింపిక్స్​కు స్టార్ అథ్లెట్ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.