ETV Bharat / sports

మంధాన అరుదైన రికార్డు.. తొలి భారత మహిళా క్రికెటర్​గా!

ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టులో స్మృతి మంధాన శతకం సాధించింది. తద్వారా పింక్ బాల్​ టెస్టులో శతకం సాధించిన మొదటి భారత మహిళా క్రికెటర్​గా రికార్డులకెక్కింది.

indw vs ausw pink ball test
స్మృతి మంధాన
author img

By

Published : Oct 1, 2021, 12:03 PM IST

ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టులో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ పింక్ బాల్​ టెస్టులో శతకం సాధించిన మొదటి భారత మహిళా క్రికెటర్​గా నిలించింది. 216 బంతుల్లో 127 పరుగులు చేసి గార్డెనర్ బౌలింగ్​లో ఔటయింది. ఇందులో 22 ఫోర్లు 1 సిక్సు ఉంది.

ఆఫ్​ సైడ్​లో భారీ షాట్​లు కొట్టిన మంధాన.. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించింది. గులాబి బంతితో ఆడడం ఇదే తొలిసారి అయినా గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది. మొదటి రోజు వర్షం అంతరాయం కలిగించినా పట్టుదలతో లక్ష్యాన్ని దాటింది. భారత్​ ఇప్పటివరకు పింక్​ బాల్​తో ఆడిన సందర్భాలు లేవు. అందులోనూ కంగారూలతో ఆడటం పెద్ద సవాలు. వీటిని అదిగమించి స్మృతి మంధాన రాణించింది.

ఇదీ చదవండి:మెరిసిన మంధాన.. డేనైట్​ టెస్టులో భారత్​ పైచేయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.