భారత్-అమెరికాల సైన్యాల మధ్య ఏటా నిర్వహించే 'యుద్ధ్ అభ్యాస్' విన్యాసాలు రాజస్థాన్లోని బీకానేర్లో సోమవారం ప్రారంభమయ్యాయి. భారత సైన్యం తరపున 170వ పదాతిదళ కమాండర్ బ్రిగేడియర్ ముఖేష్ భన్వాలా అమెరికా బృందానికి స్వాగతం పలికారు. ఇరు దేశాల సైన్యాలు సంయుక్త అభ్యాసాలు 16వ సారి నిర్వహిస్తున్నాయి.
చక్కని అవకాశం..
సైనిక కార్యకలాపాల అనుభవాలకు సంబంధించిన ఆలోచనలను ఇరు దేశాల సైనికులు పంచుకోవడానికి ఇదొక చక్కని అవకాశమని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ అమితాబ్ శర్మ వెల్లడించారు. ఉత్తమ యుద్ధ మెళకువలు నేర్చుకొనేందుకు ఈ కార్యక్రమం తోడ్పతుందన్నారు. విపత్తులు సంభవించినప్పుడు మానవతా కోణంలో సేవలందించే విద్యలను ఈ విన్యాసాల ద్వారా నేర్చుకునేందుకు వీలవుతుందని తెలిపారు.
స్వదేశీ సాంకేతికత మెరుపులు..
స్వదేశీ సాంకేతికతతో సైన్యంలోకి కొత్తగా ప్రవేశపెట్టిన 'అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్'తో పాటు.. డబ్ల్యుఎస్ఐ రుద్రా, ఎంఐ -17, చినూక్ హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ అభ్యాసాలు ఫిబ్రవరి 21 వరకు కొనసాగనున్నాయి.
భారత్, ఫ్రాన్స్ సైన్యాల సంయుక్త వైమానిక విన్యాసాలు ఇక్కడే గత నెలలో ఐదు రోజుల పాటు జరిగాయి
ఇదీ చదవండి: 'రక్షణ రంగ కేటాయింపుల్లో 60 ఏళ్ల రికార్డ్ రిపీట్!'