ETV Bharat / sports

భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు.. మెరిసిన శరత్​ కమల్​, సాత్విక్​ జోడీ - కామన్​వెల్త్​ గేమ్స్​ 2022 అప్​డేట్స్​

India's Satwik Sai Raj Rankireddy and Chirag Shetty, sharat kamal  won Gold

author img

By

Published : Aug 8, 2022, 6:01 PM IST

Updated : Aug 8, 2022, 7:01 PM IST

17:53 August 08

భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు.. ఫైనల్​లో మెరిసిన అచంత, సాత్విక్​ సాయిరాజ్​-చిరాగ్​ జోడీ

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు ఆఖరి రోజున స్వర్ణాల పంట పండుతోంది. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్​లో లక్ష్యసేన్​, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్‌ విభాగంలోనూ భారత్‌ మరో స్వర్ణం అందుకుంది. సాత్విక్‌ - చిరాగ్‌ శెట్టి జోడీ.. సీన్‌-బెన్‌ ద్వయంపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. మరోవైపు, టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఆచంట శరత్‌ కమల్‌ స్వర్ణం సాధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ మీద 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో శరత్‌ విజయం సాధించాడు.

ఈ రోజు ఇప్పటివరకు పీవీ సింధు, లక్ష్య సేన్‌, సాత్విక్‌ - చిరాగ్‌ పసిడి పతకాలు సాధించారు. శరత్‌ తెచ్చిన పతకంతో ఈ రోజు స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. భారత్‌ పతకాల సంఖ్య 60కి చేరగా, ఇందులో 22 స్వర్ణాలున్నాయి.

Last Updated : Aug 8, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.