ETV Bharat / sports

స్పీడ్ చెస్​ ఛాంపియన్​షిప్​ రన్నరప్​గా హారిక - ద్రోణవల్లి హారిక

భారత గ్రాండ్​మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల స్పీడ్ చెస్​ ఛాంపియన్​షిప్​లో రన్నరప్​గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 13-15 పాయింట్ల తేడాతో చైనా అమ్మాయి హో ఇఫాన్​ గెలుపొందింది. ​

dronavalli harika, Women's Speed Chess C'ship
ద్రోణవల్లి హారిక, మహిళల స్పీడ్ చెస్​ ఛాంపియన్​షిప్
author img

By

Published : Jul 4, 2021, 8:38 AM IST

మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్​షిప్​లో భారత గ్రాండ్​మాస్టర్​ ద్రోణవల్లి హారిక రన్నరప్​గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో హారిక 13-15 పాయింట్ల తేడాతో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్​ హో ఇఫాన్​(చైనా) చేతిలో ఓడింది. ఒక దశలో హారిక-ఇఫాన్​ 13-13 పాయింట్లతో సమానంగా నిలిచారు. తర్వాత హారిక 13-10తో విజేతగా నిలిచేలా కనిపించింది. కానీ వరుసగా మూడు గేమ్​లు గెలిచిన ఇఫాన్ స్కోరు సమం చేసింది. చివరి రెండు రౌండ్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఈ చైనా వెటరన్​ టైటిల్​ సొంతం చేసుకుంది.

"ఫైనల్​ పోరు జరుగుతుండగా ఇంటర్నెట్​ అంతరాయం కలిగించడం వల్ల ఇబ్బందిపడ్డాను. అయితే పరాజయానికి ఇదే కారణాన్ని చెప్పదల్చుకోలేదు. ఇఫాన్ గొప్పగా ఆడింది. నేను చివరి వరకు పోరాడాను" అని హారిక తెలిపింది.

ఇదీ చదవండి: చదరంగంలో 'అతిపిన్న' అభిమన్యుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.