దిల్లీలో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు సృష్టించింది దివ్య కక్రాన్. ప్రపంచ స్థాయి వేదికపై పసిడి గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా పేరు తెచ్చుకుంది. గురువారం జరిగిన 68 కేజీల విభాగంలో... ప్రత్యర్థి రెజ్లర్ నరుష మత్సుయుకి(జపాన్)పై అలవోకగా విజయం సాధించింది.
గతంలో ఈ మెగాటోర్నీలో తొలిసారి పసిడి గెలిచి చరిత్ర సృష్టించింది నవజోత్ కౌర్. 2018లో కిర్గిస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో 65 కేజీల విభాగంలో దేశానికి స్వర్ణం అందించింది.
మరో రెండు!
ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌కు మూడో స్వర్ణం అందించింది పింకీ. 55 కేజీల విభాగంలో బొలోర్మా(మంగోలియా)పై గెలిచింది. మనకు మరో రెండు రజతాలు ఖరారయ్యాయి. సరితా మోర్(59 కేజీలు), నిర్మలా దేవీ(50 కేజీలు) తమ విభాగాల్లో ఫైనల్ చేరారు. తాజా ఈవెంట్లో మొత్తం మూడు స్వర్ణాలతో కలిపి 6 పతకాలు సాధించారు భారత రెజ్లర్లు.