ETV Bharat / sports

కరోనా రూల్​ బ్రేక్.. రాష్ట్రపతి విందులో మేరీకోమ్​ - మేరీకోమ్​ క్వారంటైన్​ నిబంధన

భారత స్టార్​ బాక్సర్​ మేరీకోమ్​ కరోనా క్వారంటైన్​ నిబంధనలను ఉల్లంఘించింది. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన ఆమె.. వాటిని పాటించకుండా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఇచ్చిన ఓ విందుకు హాజరైంది. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

Indian Star Boxer Mary Kom neglect quarantine protocol and attended to a function hosted by President
కరోనా రూల్​ బ్రేక్... రాష్ట్రపతి విందుకు మేరీకోమ్​ హాజరు
author img

By

Published : Mar 21, 2020, 4:38 PM IST

Updated : Mar 21, 2020, 4:48 PM IST

జోర్డాన్​లో ఇటీవలే ఆసియా ఒలింపిక్​ క్వాలిఫయర్​ పోటీలు జరిగాయి. వీటికి హాజరైన భారత దిగ్గజ బాక్సర్, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్​.. క్వారంటైన్​ నిబంధనలను అతిక్రమించింది. ఎవరైనా విదేశాల నుంచి వస్తే, కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందేనని.. ఇప్పటికే భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించాయి. వాటిని బేఖాతరు చేస్తూ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఇటీవలే ఇచ్చిన ఓ విందుకు హాజరైంది.

మార్చి 13న స్వదేశానికి వచ్చిన మేరీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 14 రోజులు ఐసోలేషన్​లో ఉండాలి. కానీ మార్చి 18న రాష్ట్రపతి భవన్​లో కోవింద్​ ఇచ్చిన విందుకు హాజరైంది. తాజాగా రాష్ట్రపతి షేర్​ చేసిన నాలుగు ఫొటోల్లో ఆమె కనిపించడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆమెతో పాటు పలువురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు.

Mary Kom quarantine
రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ షేర్​ చేసిన ఫొటో

తాజాగా ఈ విషయంపై స్పందించింది మేరీకోమ్​. జోర్డాన్​ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నట్లు చెప్పింది. అయితే రాష్ట్రపతి విందుకు వెళ్లినా, ఎవరికీ కరచాలనం ఇవ్వలేదంది.

కరోనా పాజిటివ్​గా బయటపడిన సింగర్​ కనికా కపూర్​.. ఆ తర్వాత పలువురు ప్రముఖులను కలిసింది. ఆమెను కలిసిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్​ సింగ్,​ రాష్ట్రపతి కోవింద్​ ఇచ్చిన పార్టీకి హాజరవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు పార్లమెంట్​ సభ్యులు సహా రాష్ట్రపతికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Last Updated : Mar 21, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.