టోక్యో ఒలింపిక్స్‌కు ముందు చివరిదైన ప్రపంచకప్ షూటింగ్ టోర్నీని క్రొయేషియాలో నిర్వహించనున్నారు. వచ్చే నెల 22న ఆరంభం కానున్న ఈ టోర్నీలో భారత షూటర్లు ప్రాతినిథ్యం వహించనున్నారు.
ముందుగా అనుకున్న దాని ప్రకారం అజర్బైజాన్లో ఈ టోర్నీ నిర్వహించాల్సింది. కానీ ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో క్రొయేషియాకు తరలించారు. అయితే అంతకంటే ముందు ఈ నెల 20 న క్రొయేషియాలో ప్రారంభం కానున్న యూరోపియన్ ఛాంపియన్షిప్ కోసం 15 మంది షూటర్ల భారత బృందం మంగళవారం ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది. అక్కడే ప్రపంచకప్‌లోనూ పాల్గొన్న తర్వాత నేరుగా ఒలింపిక్స్ కోసం మన షూటర్లు టోక్యో వెళ్లనున్నారు.
ఇదీ చదవండి:బయోబబుల్ ప్రమాదమని అనుకోలేదు: స్మిత్