ETV Bharat / sports

పురుషుల హాకీ జట్టు జోరు.. ఉత్కంఠ విజయంతో కామన్వెల్త్ ఫైనల్​కు.. - భారత్ దక్షిణాఫ్రికా హాకీ సెమీ ఫైనల్ మ్యాచ్​

Commonwealth games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్​లో 3-2 తేడాతో గెలిచింది. ఈ విజయంతో కామన్వెల్త్ ఫైనల్​కు చేరుకుంది భారత్.

india mens hockey semifinal
భారత్ పురుషుల హాకీ జట్టు
author img

By

Published : Aug 7, 2022, 8:43 AM IST

Commonwealth games 2022: భారత్ పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. బర్మింగ్​హోమ్​ వేదికగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో కామన్వెల్త్​ గేమ్స్ 2022 ఫైనల్​కు చేరింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్‌ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే అభిషేక్‌ గోల్‌ కొట్టడం వల్ల భారత్‌ ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మణ్​దీప్‌ సింగ్‌ మరో గోల్​తో మెరవడం వల్ల భారత్‌ 2-0తో పటిష్ఠ స్థితికి చేరింది.

ఇక మూడో క్వార్టర్‌లో దక్షిణాఫ్రికా తరపున రెయాన్‌ జూలిస్‌ గోల్‌ కొట్టాడు. దీంతో స్కోరు 2-1కి చేరుకోగా.. నాలుగో క్వార్టర్‌ మొదలైన రెండో నిమిషంలోనే డ్రాగ్‌ ఫ్లికర్‌ జుగ్‌రాజ్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక సౌతాఫ్రికా తరపున రెండో గోల్‌ నమోదు చేసింది. చివర్లో కాస్త ఉ‍త్కంఠ నెలకొన్నప్పటికి భారత్‌ ప్రత్యర్థిని గోల్స్‌ చేయకుండా అడ్డుకొని ఫైనల్​కు చేరింది.

ఇవీ చదవండి: రెజ్లింగ్​లో పతకాల పంట.. మరో నలుగురికి గోల్డ్​

నాలుగో టీ20లో టీమ్​ఇండియా ఆల్​రౌండ్ షో.. సిరీస్​ మనదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.