ETV Bharat / sports

Praggnanandhaa: 'ఎంజాయ్ చేస్తూ ప్రపంచ విజేతను ఓడించాను'

Praggnanandhaa: వరల్డ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌తో ఆడిన మ్యాచు కోసం ప్రత్యేక వ్యూహాలేమీ అమలు చేయలేదని చెప్పాడు భారత గ్రాండ్​ మాస్టర్​ ప్రజ్ఞానంద. అతడితో ఆడుతున్నంత సేపూ ఎక్కువగా ఒత్తిడికి లోనుకాకుండా ఆటను ఎంజాయ్‌ చేశానని చెప్పాడు. కార్ల్​సన్​ను ఓడించి సంచలనంగా మారిన అతడి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి.

Praggnanandhaa
praggnanandhaa beats carlsen
author img

By

Published : Feb 23, 2022, 9:38 AM IST

Praggnanandhaa: ప్రపంచ నంబర్.1 చెస్ క్రీడాకారుడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌పై భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలన విజయం నమోదు చేశాడు. 'ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌'లో భాగంగా 8వ రౌండ్‌లో అతడు కార్ల్‌సన్‌ని ఓడించాడు. నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో ఆటను ముగించాడు. దీంతో కార్ల్‌సన్‌ని ఓడించిన మూడో భారత క్రీడాకారుడిగా రికార్డుల్లోకెక్కాడు.

ఇతడి కంటే ముందు విశ్వనాథన్‌ ఆనంద్‌, పెంటేల హరికృష్ణ.. కార్ల్‌సన్‌పై విజయం సాధించారు. 'వరల్డ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ని ఓడించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం నాలో చాలా కాన్ఫిడెన్స్‌ పెంచింది. భవిష్యత్తులోనే ఇదే స్ఫూర్తితో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాను. మ్యాచ్ తర్వాత కాస్త విరామం తీసుకుని.. భవిష్యత్తు టోర్నమెంట్లపై దృష్టి పెడతాను. కార్ల్‌సన్‌తో ఆడిన మ్యాచు కోసం ప్రత్యేక వ్యూహాలేమీ అమలు చేయలేదు. అతడితో ఆడుతున్నంత సేపూ ఎక్కువగా ఒత్తిడికి లోనుకాకుండా ఆటను ఎంజాయ్‌ చేశాను' అని ప్రజ్ఞానంద చెప్పాడు.

Praggnanandhaa
ప్రజ్ఞానంద

ప్రముఖుల ప్రశంసలు

Praggnanandhaa vs Carlsen: కార్ల్‌సన్‌పై సంచలన విజయం సాధించిన ప్రజ్ఞానందని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, చెస్ క్రీడాకారులు విశ్వనాథన్‌ ఆనంద్‌, పెంటేల హరికృష్ణ, ఆల్ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ కపూర్‌, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ తదితరులు ప్రజ్ఞానందని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

ప్రజ్ఞానంద గురించి మరి కొన్ని విశేషాలు.!

  • 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌పై విజయం సాధించిన ప్రజ్ఞానంద పూర్తి పేరు రమేశ్‌బాబు ప్రజ్ఞానంద. తమిళనాడులోని చెన్నై ఇతడి స్వస్థలం.
  • 2013లో ప్రజ్ఞానంద అండర్‌-8 వరల్డ్ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత రెండేళ్లకు అండర్‌-10 టైటిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడు.
  • 2016లో (10 ఏళ్ల 10 నెలలకే) ఇంటర్నేషనల్‌ మాస్టర్ స్థాయికి ఎదిగాడు.
  • 2018లో (12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో) తొలిసారి 'గ్రాండ్‌ మాస్టర్' టైటిల్ సాధించాడు.
  • మూడేళ్ల వయసు నుంచే అక్క వైశాలితో చెస్ ఆడటం మొదలు పెట్టాడు. ఆమె కూడా చెస్ క్రీడాకారిణి కావడం విశేషం. ఆమె 2018లో విమెన్‌ గ్రాండ్ మాస్టర్, 2021లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిళ్లను సాధించింది.

ఇవీ చూడండి:

Chess: ప్రజ్ఞానంద ఖాతాలో మరో రెండు విజయాలు

ప్రపంచ నెం.1కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్​మాస్టర్

'చారిత్రక విజయంలో భాగమవ్వడం గొప్ప అనుభూతి '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.