జపాన్ టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్లో భారత బాక్సర్లు సత్తాచాటుతున్నారు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో గెలిచిన శివథాపా, పూజారాణి.. ఫైనల్‌కు అర్హత సాధించారు.
పురుషుల 63 కేజీల విభాగంలో జపాన్‌కు చెందిన డైసుకే నారిమత్సుపై విజయం సాధించాడు శివ థాపా. నాలుగుసార్లు ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన ఈ బాక్సర్ పంచ్‌లకు ప్రత్యర్థి నేలకొరిగాడు.
మహిళల 75 కేజీల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బియాత్రిజ్ సోర్స్‌ను ఓడించింది పూజా రాణి. ఈ ఏడాది జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన పూజ.. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది.
సెమీస్ మరో మ్యాచ్.. 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, వహ్లీంపుయా(75 కేజీల) పరాజయం పాలయ్యారు. కానీ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.