ETV Bharat / sports

టోక్యో బెర్త్​కు బౌట్​ దూరంలో ఇద్దరు భారతీయులు

ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్​ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు దూసుకెళ్తున్నారు. మనీశ్​ కౌశిక్‌ (63 కేజీలు), ఆశిష్​ కుమార్‌ (75 కేజీలు) తాజాగా క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్‌ మ్యాచ్​ల్లో.. వీరిద్దరూ అలవోకగా విజయం సాధించారు.

Asian Olympic qualifiers 2020
టోక్యో బెర్త్​కు బౌట్​ దూరంలో ఇద్దరు భారతీయులు
author img

By

Published : Mar 6, 2020, 8:50 AM IST

జోర్డాన్‌లోని అమన్​ వేదికగా జరుగుతున్న ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్‌ బాక్సింగ్‌ టోర్నీలో... భారత్​ సత్తా చాటుతోంది. క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు).. టోక్యో ఒలింపిక్స్‌కు బౌట్‌ దూరంలో నిలిచారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఆశిష్‌.. 5-0 తేడాతో నాలుగో సీడ్‌ ఉముర్బెక్‌ (కిర్గిస్థాన్‌)ను చిత్తుచేశాడు. మరో పోరులో మనీశ్‌.. 5-0 తేడాతో చు ఎన్‌ (తైవాన్‌)పై విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో ఆశిష్‌.. ఇండోనేషియా బాక్సర్‌ మైకేల్‌తో, మనీశ్‌.. చింజోరిగ్‌ (మంగోలియా)తో తలపడనున్నారు.

ఈ ఇద్దరూ సెమీస్​ చేరితే టోక్యో బెర్త్​ ఖరారు కానుంది. మహిళల విభాగంలో భారత్‌కు చెందిన సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (60 కేజీలు), సాక్షి చౌదరి(57 కేజీలు) ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. ఈ టోర్నీలో మొత్తం 13 మంది భారత ఆటగాళ్లు.. టోక్యో టికెట్ కోసం బరిలోకి దిగారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.