బక్సమ్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ కాంస్యంతో సంతృప్తి పడింది. ఆమె సెమీఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. శుక్రవారం మహిళల 51 కేజీల విభాగం సెమీస్‌లో మేరీ.. వర్జీనియా (అమెరికా) చేతిలో ఓడింది.
ఈ పోరులో మేరీ దూకుడుగానే ఆడింది. ఆ జోరు చూస్తే విజయం ఆమెదే అనిపించింది. కానీ న్యాయ నిర్ణేతలు మాత్రం అమెరికా బాక్సర్ పక్షాన నిలిచారు. దీంతో మేరీకి నిరాశ తప్పలేదు. మరోవైపు సతీష్ కుమార్ (91 కేజీల పైన), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు) సెమీస్ చేరారు.
ఇదీ చదవండి: 'బంతి గమనాన్ని బట్టే నా ఆట ఉంటుంది'