ETV Bharat / sports

ప్రపంచకప్: షూటింగ్​లో భారత్​కు స్వర్ణ పతకాలు - మను బాకర్ ప్రపంచకప్

షూటింగ్ ప్రపంచకప్​లో భారత షూటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. ఎయిర్ పిస్టోల్​ విభాగంలో మహిళల బృందంతో పాటు పురుషుల టీమ్​ కూడా స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాయి.

India women won gold medal in 10m Air Pistol team event at ISSF Shooting World Cup
షూటింగ్ ప్రపంచకప్: మహిళా, పురుష బృందాలకు స్వర్ణ పతకాలు
author img

By

Published : Mar 21, 2021, 2:01 PM IST

Updated : Mar 21, 2021, 3:07 PM IST

దిల్లీలో జరుగుతున్న ఐఎస్​ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​లోని 10 మీటర్ల ఎయిర్​ పిస్టోల్​ విభాగంలో భారత మహిళల బృందం స్వర్ణం సాధించింది. ఇందులో మను బాకర్, యశస్విని దీస్వాల్, శ్రీ నివేదా పరమనాథన్ ఉన్నారు. ఆదివారం జరిగిన పోరులో పోలాండ్ బృందంపై గెలిచి ఈ పతకం చేజిక్కుంచుకుంది.

ఎయిర్​ రైఫిల్​ విభాగంలో ప్రతాప్ సింగ్ తోమర్, దీపక్ కుమార్, పంకజ్ కుమార్​లతో కూడిన బృందం.. వెండి పతకం సాధించింది. మహిళల విభాగం కాంస్యం సొంతం చేసుకుంది.

పురుషుల విభాగంలోనూ..

10 మీటర్ల ఎయిర్​ పిస్టోల్ విభాగంలో పురుషుల బృందం స్వర్ణం సాధించింది. ఈ బృందంలో సౌరభ్​ చౌదరి, అభిషేక్​ వర్మ, షాజార్ రిజ్వీ ఉన్నారు. వియత్నాం బృందంపై 17-11తో విజయం సాధించిన భారత్​.. గోల్డ్​మెడల్​ను కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి: 'రాహుల్​ ఆడకపోవడం భారత్​కు మంచిదైంది'

Last Updated : Mar 21, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.