బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్‌పై 7 వికెట్ల తేడాతో స్టోక్స్ సేన గెలిచింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416, రెండో ఇన్నింగ్స్ 245 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు నష్టపోయి.. 378 పరుగులు చేసిన సునాయసంగా విజయాన్ని అందుుకుంది. లక్ష్య ఛేదనలో జో రూట్, బెయిర్‌స్టో శతకాలతో చెలరేగిపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ 142, బెయిర్‌స్టో 114 పరుగులు చేశారు.
109కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రూట్, బెయిర్‌స్టో ఆదుకున్నారు. ఈ క్రమంలోనే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఇంగ్లాండ్‌కు టెస్టుల్లో అత్యధిక ఛేదన నమోదు చేశారు. దీంతో ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో ఉండగా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి చారిత్రక సిరీస్ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, రూట్, బెయిర్‌స్టో టీమ్‌ఇండియా ఆశలపై నీళ్లు పోశారు.
- ఐదో టెస్టులో ఇవే రికార్డులు: టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సాధించినా ఓటమిపాలవ్వడం ఇది రెండోసారి. 2015లో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయినా, ఆ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.
- టీమ్‌ఇండియాపై టెస్టుల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక పరుగుల ఛేదన. అంతకుముందు 1977లో పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 339 పరుగుల రికార్డు ఛేదన చేసింది. అలాగే 1987లో దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక 2002లో జోహెనెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
- ఇక ఇంగ్లాండ్ జట్టుకు టెస్టుల్లో ఇదే అత్యధిక ఛేదన. ఇదివరకు 2019లో లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే 1928/29 సీజన్‌లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 332 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.
ఇదీ చదవండి: భారత ఫ్యాన్స్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు.. స్పందించిన ఇంగ్లాండ్ బోర్డు