ETV Bharat / sports

ఒలింపిక్స్​ నిర్వహణపై భారత్​ ఆసక్తి

2026 యూత్, 2032 ఒలింపిక్స్​ కోసం బిడ్​ వేయాలని భావిస్తోంది భారత్. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు ఐఓసీ అధ్యక్షుడు నరీందర్ బత్రా.

India to step up bid for 2032 Olympics after pandemic: Narinder Batra
ఒలింపిక్స్ నిర్వహణపై భారత్ ఆసక్తి
author img

By

Published : May 3, 2020, 5:45 AM IST

Updated : May 3, 2020, 6:55 AM IST

ఒలింపిక్స్ నిర్వహణపై భారత్​ ఆసక్తి చూపిస్తోంది. 2032లో ఈ మెగాక్రీడల్ని జరిపేందుకు ఉత్సాహంగా ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మరి అంతమయ్యాక.. ఈ క్రీడల నిర్వహణపై దృష్టి పెట్టనున్నామని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్రా తెలిపారు.

"2026 యూత్ ఒలింపిక్స్​తో పాటు 2032 ఒలింపిక్స్​ హక్కుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ఇందుకు సంబంధించిన తుది జాబితాను 2025 చివరికల్లా సిద్ధం చేస్తాం. ఈ ఏడాది తర్వాత ఓ కమిటీ వేసి, వేదికల పరిశీలన ప్రారంభిస్తాం" -నరీందర్ బత్రా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు

IOC PRESIDENT Narinder Batra
భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షుడు న‌రీంద‌ర్ బత్రా

2010లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించిన భారత్.. ఆ తర్వాత మరో మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వలేదు. ఇందులో భాగంగానే ఒలింపిక్స్ కోసం బిడ్ వేసే ఆలోచనలో ఉంది. అయితే మనతో పాటే క్వీన్స్ లాండ్(ఆస్ట్రేలియా), షాంఘై(చైనా), సియోల్-ప్యాంగ్​యాంగ్(దక్షిణ కొరియా)లు ఒలింపిక్స్ హక్కుల కోసం బిడ్​ వేయాలని భావిస్తున్నాయి.

Last Updated : May 3, 2020, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.