ETV Bharat / sports

భారత్​ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్​షిప్​ - యోగా

ఒడిశా వేదికగా వచ్చే ఏడాది ప్రపంచ యోగా ఛాంపియన్​షిప్​ జరగనుంది. ఈ విషయాన్ని జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య ప్రకటించింది.

yoga championship
భారత్​ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్​షిప్​!
author img

By

Published : Nov 12, 2021, 5:31 AM IST

యోగాపై అవగాహన మరింత విస్తృతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఒడిశాలోని భువనేశ్వర్​ వేదికగా జరగనున్నట్లు జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్​వైఎస్​ఎఫ్​) అధ్యక్షుడు ఉదిత్​శేత్​ గురువారం వెల్లడించారు.

'భారత్​లో 2022 జూన్​లో తొలిసారిగా ప్రపంచ యోగా ఛాంపియన్​ నిర్వహించనున్నాం. ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా ప్రభుత్వానికి ధన్యవాదాలు' అని ఉదిత్​శేత్​ పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో కూడా యోగాకు క్రీడగా మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.

యోగాను క్రీడగా ఇటీవల గుర్తించిన కేంద్రం.. ఈ ఏడాది నిర్వహించిన ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో యోగాకు స్థానం కల్పించింది. మహిళలు, పురుషుల విభాగాల్లో చాలామంది అభ్యర్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మరోసారి 'దంగల్'​కు సిద్ధమైన గీతా ఫొగాట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.