ETV Bharat / sports

'కామన్వెల్త్​'​ గేమ్స్​లోని ఆ పోటీలు భారత్​లోనే - కామన్వెల్త్​ గేమ్స్ ఆర్చరీలను

బర్మింగ్​హమ్​లో 2022లో జరగనున్న కామన్వెల్త్​ గేమ్స్​లోని షూటింగ్, ఆర్చరీలను భారత్​లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కామన్వెల్త్​ గేమ్స్​ ఫెడరేషన్​ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

cgf
'కామన్వెల్త్​'​ గేమ్స్​లోని ఆ పోటీలు భారత్​లోనే
author img

By

Published : Feb 24, 2020, 9:16 PM IST

Updated : Mar 2, 2020, 11:05 AM IST

2022లో బర్మింగ్​హమ్​ వేదికగా కామన్వెల్త్ పోటీలు జరగనున్నాయి. అయితే ఇందులో షూటింగ్​ను తొలగించడం వల్ల, ఈ గేమ్స్​ను బహిష్కరిస్తున్నామని భారత బృందం గతేడాది జులైలోనే చెప్పింది. ఈ విషయంపైనే ఈనెల 21 నుంచి 23 తేదీల మధ్య కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్​లో చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో భారత్ పంతం నెగ్గింది. షూటింగ్​తో పాటు ఆర్చరీ పోటీలను భారత్​లోనే నిర్వహించనున్నామని తేల్చింది కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్. 2022 జనవరిలో చండీగఢ్​ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. పతకాలు మాత్రం బర్మింగ్​హమ్​లోనే ప్రదానం చేయనున్నారు. కామన్వెల్త్​ పోటీలు 2022 జులై 27 నుంచి ఆగస్టు 7 వరకు జరగనున్నాయి.

ఇదీ చూడండి : ఎవరు ఏమనుకుంటున్నారో పట్టించుకోను: కోహ్లీ

Last Updated : Mar 2, 2020, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.