India Open 2022: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి స్టార్ షటర్ల్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. రెండో రౌండ్లో మాలవిక బన్సోడ్ చేతిలో సైనా ఓడిపోయింది. దాదాపు 35 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో 21-17, 21-9 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది సైనా.
అంతకుముందు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. క్వార్టర్స్లోకి ప్రవేశించింది. ప్రత్యర్థి ఇరా శర్మను 21-10, 21-10 తేడాతో ఓడించింది.
ఇక ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో భారత్కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్పతో పాటు మరో ఐదుగురికి కరోనా సోకినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) వెల్లడించింది.
ఇదీ చదవండి:
శ్రీకాంత్ సహా ఏడుగురు భారత ఆటగాళ్లకు కరోనా.. టోర్నీ నుంచి అవుట్