ETV Bharat / sports

ఆ ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ బరిలో భారత్

author img

By

Published : Aug 24, 2021, 11:02 PM IST

2036, 2040 లేదా ఆ తర్వాతి సంవత్సరాల్లోనైనా ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఆసక్తి చూపుతోందన్నారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్. భారత ఒలింపిక్ సంఘం కూడా దీనిపై స్పష్టతనిచ్చింది.

ఒలింపిక్స్
ఒలింపిక్స్

2036 లేదా 2040 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు. 2032 ఒలింపిక్స్​కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరంగా బ్రిస్బేన్(ఆస్ట్రేలియా) గత నెలలో ఎంపికైంది. ఈ నేపథ్యంలో 2036, 2040 సంవత్సరాల్లో మెగా ఈవెంట్​కు ఆతిథ్యమిచ్చే దేశాల్లో భారత్​ సహా.. ఇండోనేసియా, జర్మనీ, ఖతార్​లు ఉన్నట్లు ప్రముఖ పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్'(WSJ)కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాచ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా ధ్రువీకరించారు.

"ప్రస్తుతానికిది నాకొచ్చిన ఆలోచన మాత్రమే. దీర్ఘకాల ప్రణాళికల్లో భాగంగా భారత్ ఈ క్రీడలను నిర్వహించగలదనే అనుకుంటున్నా."

-థామస్ బాచ్, ఐఓసీ అధ్యక్షుడు

అప్పటికి నిర్వహించాల్సిందే..

2048నాటికి భారత్ స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తవుతాయని.. ఈ సందర్భంగా ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ దాఖలు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రయత్నిస్తామని ఈ ఏడాది మార్చిలో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఈ మేరకు కావాల్సిన మౌలిక సదుపాయాలను మెరగుపరుస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు.. విశ్వ క్రీడల నిర్వహణకు వ్యయం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో బాచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్​కు అయిన ఖర్చుపైనా విమర్శలొచ్చాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.