ETV Bharat / sports

Ind Vs Pak Hockey 2023 : ఆసియా ఛాంపియన్స్​ ట్రోఫీ.. పాక్​పై భారత్​ ఘన విజయం..

Ind Vs Pak Hockey 2023 : సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు తన జోరును కొనసాగించింది. బుధవారం జరిగిన హోరా హోరీ మ్యాచ్​లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌‌ను మట్టి కరిపించింది.

Ind Vs Pak Hockey 2023
Ind Vs Pak Hockey 2023
author img

By

Published : Aug 10, 2023, 6:48 AM IST

Ind Vs Pak Hockey 2023 : ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్​లో భారత్‌ అదరగొట్టింది. తమ చిరకాల ప్రత్యర్థైన పాకిస్థాన్​ పై 4-0 గోల్స్‌తో ఘన విజయాన్ని సాధించింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్‌..చివరి వరకు దూసుకెళ్లింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ (15వ, 23వ) కొట్టగా.. మరో ప్లేయర్​ జుగ్‌రాజ్‌ సింగ్‌ (36వ), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (55వ) చెరో గోల్​ను సాధించారు. అయితే మూడు గోల్స్‌ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. ఇక ఆకాశ్‌దీప్‌ ఫీల్డ్‌ గోల్‌ సాధించాడు.

అయితే పాకిస్థాన్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో అజేయ రికార్డు నిలబెట్టుకున్న భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో గ్రూప్‌ దశను ముగించింది. 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి, ఒకదాన్ని డ్రాగా ముగించిన హర్మన్‌ప్రీత్‌ టీమ్​..13 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌ను ఢీకొట్టనుంది. మరో సెమీస్‌లో మలేసియా, కొరియా తలపడతాయి.

Ind Vs Pak Hockey : మరోవైపు పాక్​తో జరిగిన పోరులో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌కు ముందే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన ఆతిథ్య జట్టు.. మరింత ఆత్మవిశ్వాసంతో ఆడింది. తొలి క్వార్టర్‌ ఆఖరిలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ ఓ బలమైన లో ఫ్లిక్‌తో సద్వినియోగం చేశాడు. ఇక 23వ నిమిషంలో భారత్‌కు రెండో పెనాల్టీ కార్నర్‌ లభించింది. దాన్ని కూడా హర్మన్‌ప్రీత్‌ వృథా పోనివ్వలేదు.

బలమైన డ్రాగ్‌ ఫ్లిక్‌తో పాకిస్థాన్‌ గోల్‌కీపర్‌ అక్మల్‌ కాళ్ల మధ్య నుంచి నెట్​లోకి కొట్టి భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆ తర్వాత కూడా వరుస దాడులతో పాకిస్థాన్‌ రక్షణ శ్రేణిపై భారత్‌ తీవ్ర ఒత్తిడిని కొనసాగించింది. ఫలితంగా 30వ నిమిషంలో వరుసగా రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే ఆ రెండు అవకాశాలను ఉపయోగించుకోవడంలో హర్మన్‌ప్రీత్‌ విఫలమయ్యాడు.

India Vs Pakistan Hockey : బ్రేక్​కు 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌.. తిరిగి ఆట మొదలైన ఆరు నిమిషాలకే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్‌ గోల్‌గా మలిచాడు. 43వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను పాకిస్థాన్‌ వృథా చేసుకుంది. అంతకుముందు కూడా ఓ పెనాల్టీ కార్నర్‌ను ఆ జట్టు ఉపయోగించుకోలేకపోయింది. 55వ నిమిషంలో మన్‌దీప్‌ సింగ్‌ స్ట్రైక్‌ను అకాశ్‌దీప్‌ నెట్లోకి నెట్టడంతో భారత్‌ 4-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది.

హాకీ స్టార్​ ప్లేయర్​గా ఎదిగినా.. ఇంకా కటిక పేదరికమే.. గ్యాస్​, నీటి కనెక్షన్​ కూడా...

మెరుగైన వసతులతో 'హాకీ' పునరుజ్జీవం.. ఫ్యాన్స్​లో మళ్లీ కొత్త ఆశలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.