ETV Bharat / sports

'ఒలింపిక్స్​లో క్రికెట్.. ఇంకా ఆశ పోలేదు'

Cricket in Olympics 2028: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై తమకు ఇంకా ఆశలు ఉన్నాయని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ పేర్కొంది. 'అదనపు స్పోర్ట్స్' విభాగంలో క్రికెట్‌ను చేర్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

cricket
క్రికెట్
author img

By

Published : Dec 11, 2021, 10:07 PM IST

Cricket in Olympics 2028: లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌ ప్రాథమిక జాబితాలో క్రికెట్‌ పేరు లేకపోవడంపై ఎలాంటి నిరాశకు గురికాలేదని అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) వెల్లడించింది. గత ఆగస్టు నుంచి 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఒలింపిక్స్ కమిటీ విడుదల చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై ఐసీసీ తాజాగా స్పందించింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై తమకు ఇంకా ఆశలు ఉన్నాయని పేర్కొంది. 'అదనపు స్పోర్ట్స్' విభాగంలో క్రికెట్‌ చేర్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

"ఆతిథ్యం నగరం (లాస్‌ఏంజెలెస్‌) అదనపు క్రీడలను ఎంచుకునే ప్రక్రియ 2023 నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడు క్రికెట్‌ కూడా భాగం కావాలని కోరుతున్నాం. అయితే క్రికెట్‌ను అదనపు క్రీడగా చేర్పించడం కఠిన సవాలే. ఇప్పటికైతే ఎలాంటి హామీ ఇవ్వలేం. గత ఆగస్టులో క్రికెట్‌ను కూడా చేర్చాలని కోరాం. దీనికి బీసీసీఐ మద్దతు కూడా మాకు ఉంది" అని ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు వెల్లడించారు.

భవిష్యత్తులో..

ఇప్పటికైతే ఐవోసీ స్థానం కల్పించకపోయినా.. ఆట పట్ల ప్రాచుర్యం, యువతలో క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో క్రికెట్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. "దాదాపు వంద కోట్లకుపైగా అభిమానులు క్రికెట్‌ సొంతం. అందులో 90 శాతం వరకు క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలని కోరుతున్నారు. సుదీర్ఘ కాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే క్రికెట్‌ను చేర్చాలని ఐవోసీకి విన్నవించాం" అని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్ బార్‌క్లే తెలిపారు. ఆతిథ్యం ఇచ్చే లాస్‌ఏంజెలెస్‌కు అదనపు క్రీడలను ఒలింపిక్స్‌లో ఎంట్రీ చేయించే అవకాశం ఉంది. బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ అదనపు స్పోర్ట్ష్ కింద చేర్చొచ్చు. ఈ క్రమంలో క్రికెట్‌ను కూడా యాడ్‌ చేయించాలనేది ఐసీసీ ప్రయత్నం.

ఐవోసీ ప్రధాన ఆటల జాబితాను మాత్రమే విడుదల చేస్తూ ఉంటుంది. ఈసారి బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఆధునిక పెంటాథ్లాన్‌కూ ప్రాథమిక జాబితాలో లభించలేదు. తమ స్థానాలను కాపాడుకోవడానికి ఆయా సంఘాలకు 2023 వరకు ఐవోసీ గడువునిచ్చింది. ఈ లిస్ట్‌ను బీజింగ్‌ వేదికగా జరిగే సమావేశాల్లో అప్రూవల్‌ కోసం ఐవోసీ ఓటింగ్‌ నిర్వహిస్తుంది. దీంతో క్రికెట్‌ను లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో చూస్తామో లేదో.. తెలియాలంటే వేచి ఉండక తప్పదు. 1900 పారిస్‌ క్రీడల్లో క్రికెట్‌ క్రీడను చేర్చారు. ఆ తర్వాత ఎప్పుడూ స్థానం దక్కలేదు.

ఇదీ చదవండి:

అభిమానులకు నిరాశ.. ఆ ఒలింపిక్స్​లో క్రికెట్‌కు చోటు లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.