ETV Bharat / sports

'ఒలింపిక్ రికార్డ్​కూ ట్రై చేశా.. కానీ కుదరలే..' - నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించటం 'నమ్మశక్యం కాని అనుభూతి' అని జావెలిన్​ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా అన్నాడు. స్వర్ణం వస్తుందని అనుకోలేదన్నాడు. తన స్వర్ణాన్ని పరుగుల వీరుడు మిల్కాసింగ్​కు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు.

Neeraj Chopra
నీరజ్ చోప్రా
author img

By

Published : Aug 7, 2021, 8:24 PM IST

Updated : Aug 7, 2021, 10:52 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధిస్తానని అనుకోలేదని జావెలిన్​ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా తెలిపాడు. ఇదో నమ్మలేని అనుభూతి అన్నాడు. టోక్యో ఒలింపిక్స్​లో జావెలిన్​ త్రో లో స్వర్ణం సాధించిన అనంతరం చోప్డా స్పందించాడు.

Neeraj Chopra
స్వర్ణపతకంతో నీరజ్
Neeraj Chopra
జావెలిన్ విసురుతున్న నీరజ్

"ప్రపంచపోటీల్లో పాల్గొనటం ఈ సంవత్సరం ఎంతో అనుభూతినిచ్చింది. నేను గతంలో ఆడిన 2-3 ప్రపంచ పోటీలు నాకు ఉపయోగపడ్డాయి. దీంతో ఒలింపిక్స్​లో నేను ఒత్తిడికి లోనవ్వలేదు. నా ఆటపైనే దృష్టి సారించా. మొదటిసారి జావెలిన్ విసిరినప్పుడు మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను రెండోసారి కూడా బాగా వేశాను. దీంతో ఒలింపిక్ రికార్డ్ 90.57 మీటర్లను అధిగమించాలనుకున్నా.. కానీ అది జరగలేదు. త్వరలో 90 మీటర్లు సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నా."

-- నీరజ్ చోప్డా, ఒలింపిక్స్ పతక విజేత

"2019లో నేను ఓపెన్​ ఇంటర్నేషనల్​కు అర్హత సాధించా. విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయి. కానీ ఆదిల్ సార్.. ఈ గేమ్స్​లో ఆడొద్దని సూచించారు. ఒలింపిక్స్​పై దృష్టి సారించమన్నారు. ఇప్పుడు అది నిజమైంది. ఒలింపిక్స్​లో ఏ ఆటైనా.. ఒక్కరోజు ఈవెంట్ కాదు. సంవత్సరాల కృషి, కుటుంబ ప్రోత్సాహం ఉంది. భారత్ ఒలింపిక్స్​లో ఎన్నో పతకాలు సాధించింది. కానీ మిల్కాసింగ్, పీటీ ఉషా లాంటి వాళ్లు పతకాలు సాధించలేకపోయారు."

-- నీరజ్ చోప్డా, ఒలింపిక్స్ పతక విజేత

'టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించటం నమ్మశక్యం కాని అనుభూతి. భారత్​ అథ్లెటిక్స్​లో స్వర్ణం సాధించటం ఇదే మొదటిసారి. నాకు చాలా గర్వంగా ఉంది.' అని 23 ఏళ్ల యువ ఆటగాడు చోప్డా తెలిపాడు.

స్వర్ణ యాత్ర..

Neeraj Chopra
జావెలిన్​తో నీరజ్ చోప్డా

మూడు రోజుల క్రితం జరిగిన క్వాలిఫికేషన్‌లోనే 86.59 మీటర్ల త్రోతో ఫైనల్​కు అర్హత సాధించాడు. అయితే ఫైనల్స్​లో ఆ మార్కును దాటాడు. ఫైనల్లో తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు దూరం విసిరిన నీరజ్​.. మరో రౌండ్​లో 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరి పతకం ఖరారు చేశాడు. దీంతో.. ఏ దశలోనూ అతడికి పోటీ లేకుండా పోయింది.

Neeraj Chopra
జాతీయ పతాకంతో నీరజ్ చోప్డా

మిల్కాసింగ్​కు అంకితం..

పరుగుల వీరుడు మిల్కా సింగ్​కు తన స్వర్ణ పతకాన్ని అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు నీరజ్ చోప్డా.

ఇవీ చదవండి:

ఎవరీ నీరజ్ చోప్రా? ఊబకాయుడి నుంచి ఒలింపిక్ ఛాంపియన్​గా..

స్వర్ణం గెల్చినందుకు రూ. 6 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగం

Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా- భారత్​కు స్వర్ణం

Last Updated : Aug 7, 2021, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.