How to Watch World Cup 2023 Live Matches for Free : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ 2023 (World Cup 2023) మెగా టోర్నీ వచ్చేసింది. క్రికెట్ అభిమానులకు ఎఁతో ఇష్టమైన ఈ పండగ.. ఇవాళ్టి(అక్టోబర్ 5) నుంచే ప్రారంభం అవుతోంది. ఇప్పటికే 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో మొదటిసారి, 2011లో ధోనిసేన నాయకత్వంలో రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన టీమిండియా.. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో ముచ్చటగా మూడోసారి అందుకోవాలని చూస్తోంది.
ODI World Cup 2023 Latest Update : వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ ప్రపంచ కప్‌లో నాకౌట్ మ్యాచ్‌లతో కలిపి మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో 45 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోని 10 వేదికల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 19న ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డు పడుతుంది. మరి ఈ మెగా టోర్నీ ఆసాంతం.. స్మార్ట్ఫోన్లలో(Smart Phones) ఉచితంగా ఎలా చూడవచ్చో తెలుసుకుందాం.
How to Watch World Cup 2023 Live Matches on Mobiles : ఈ మహా సంగ్రామంలో.. భారత్ తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఇండియా Vs పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. వీటితో పాటు భారత్ మరికొన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. ఈ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నీ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అదే మీరు మొబైల్లో చూడాలంటే డిస్నీ+హాట్‌స్టార్(Disney+Hotstar)లో ఈ మ్యాచ్‌లు ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ ప్లాట్‌ఫారమ్ తన మొబైల్ యాప్, అధికారిక వెబ్సైట్లో ఈ టోర్నమెంట్‌ను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన డిజిటల్ హక్కులను కలిగి ఉంది. యాప్ ద్వారా మాత్రమే ఉచిత లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
అదే ల్యాప్‌టాప్/పీసీ లేదా స్మార్ట్ టీవీలో మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడే వీక్షకులు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్‌లలో ఆన్‌లైన్ మ్యాచ్ స్ట్రీమింగ్ ఉచితం అయినప్పటికీ, రిజల్యూషన్ కేవలం HD నాణ్యతకు పరిమితం చేయబడుతుందనే విషయం గమనించాలి. అయితే వీటిని మొబైల్లో ఉచితంగా ఏ విధంగా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
How to Watch ODI World Cup Live Matches in Android and iPhone :
ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో ICC ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్‌లో ఎలా చూడవచ్చంటే..?
- మొదట మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత Disney+ Hotstar యాప్‌ని ఓపెన్ చేసి.. లైవ్ మ్యాచ్ అయితే ఎగువన ఉన్న బ్యానర్‌ని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ‘స్పోర్ట్స్’ ట్యాబ్‌ను నొక్కడం ద్వారా మీరు మ్యాచ్ లైవ్ స్ట్రీమ్‌లను యాక్సెస్ చేయవచ్చు.
- అలాగే మీరు Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌ని కలిగి ఉన్నట్లయితే, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి Hotstar వెబ్‌సైట్ ద్వారా ల్యాప్‌టాప్ లేదా PCలో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
స్మార్ట్ టీవీలో వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లు ఎలా వీక్షించాలంటే..?
How to Watch ODI World Cup Live Matches in Smart Tvs : మొదట స్మార్ట్ టీవీ ఉన్నవారు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అందుబాటులో ఉన్న సంబంధిత యాప్ స్టోర్‌ల ద్వారా అధికారిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన వివిధ ప్లాన్లు మీకు కనిపిస్తాయి. అప్పుడు వాటిలో మీకు నచ్చిన ప్యాక్‌ను కొని ఈ మ్యాచ్‌లను చూడవచ్చు. ICC వన్డే ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ భాషలలో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి.
World Cup 2023 India Winning Chances : వరల్డ్‌కప్‌కు భారత్ రె'ఢీ'.. టీమ్ఇండియా బలాబలాలివే..
స్మార్ట్ టీవీ ద్వారా ODI ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఆస్వాదించడానికి సభ్యత్వాలిలా..
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సూపర్ : రూ.299తో 3 నెలలకు, 899 రూపాయలతో 12 నెలలకు అందిస్తున్న ఈ ప్లాన్స్‌తో పూర్తి HD వీడియో నాణ్యతతో చలనచిత్రాలు, ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడవచ్చు. అలాగే గరిష్ఠంగా 2 డివైజ్‌లకు లాగిన్ అవ్వొచ్చు. అదేవిధంగా డాల్బీ అట్మాస్ సౌండ్‌కి సపోర్ట్ చేస్తుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం : రూ. 499 రూపాయల 3 నెలల ప్లాన్, 1,499 రూపాయలతో 12 నెలల ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో చలనచిత్రాలు, ప్రత్యక్ష క్రీడలు, ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు 4K వీడియో నాణ్యతతో చూడవచ్చు. ఈ ప్లాన్స్‌తో గరిష్ఠంగా 4 పరికరాలకు లాగిన్ అవ్వొచ్చు. ఇవి కూడా డాల్బీ అట్మాస్ సౌండ్‌కి సపోర్ట్ చేస్తాయి.
ICC World Cup Sponsors List : ప్రపంచకప్‌కు స్పానర్ల వెల్లువ.. ఈ సారి మరింత కొత్తగా..
World Cup 2023 Ambassador : ప్రపంచకప్ గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్.. ఫుల్ ఖుషిలో తెందూల్కర్ ఫ్యాన్స్