Hockey Indian Team For FIH World Cup 2024 : ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ 2024 వరల్డ్‌కప్‌నకు భారత పురుషుల, మహిళల జట్లను సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది . రెండు విభాగాల్లో 10 మందితో కూడిన జట్లను ఫైనలైజ్ చేస్తూ హాకీ ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా, పురుషుల జట్టుకు సిమ్రన్‌జీత్ నాయకత్వం వహించగా, రజని ఎప్టిమర్పు మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మస్కట్, ఒమన్ వేదికగా 2024 జనవరి 24 నుంచి 27 వరకు మహిళల పోటీలు జరగనుండగా, జనవరి 28 నుంచి 31 వరకు పురుషుల హాకీ పోటీలు ఉండనున్నాయి.
మహిళల జట్టు :
- రజనీ ఎప్టిమర్పు (కెప్టెన్)
- మహిమా చౌదరీ (వైస్ కెప్టెన్)- డిఫెండర్
- బన్సారీ సోలంకీ - గోల్‌కీపర్
- ఆక్షత ధేక్లే- డిఫెండర్
- జ్యోతి ఛత్రి- డిఫెండర్
- మరియానా కజుర్- మిడ్ ఫీల్డర్
- ముంతాజ్ ఖాన్- మిడ్ ఫీల్డర్
- అజ్మినా కజుర్- ఫార్వడ్స్
- రుతాజ పిసల్- ఫార్వడ్స్
- దీపికా సొరెంగ్- ఫార్వడ్స్
మహిళా జట్టు కోచ్‌గా సౌందర్య బాధ్యతలు నిర్వహించనున్నారు.'హాకీ 5 వరల్డ్‌కప్‌లో ఆడడానికి తగ్గ ఇంటర్నేషనల్ ప్లేయర్లు మా జట్టులో ఉన్నారు. టోర్నీలో ఉండే సవాళ్లను ఎదుర్కొనే అనుభవం వారిలో ఉంది. ప్రపంచకప్‌నకు మేం రెడీగా ఉన్నాం' అని సౌందర్య అన్నారు. ఇక టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. అందులో ప్రతీ గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి.
- ఫూల్ ఏ (Pool A)- ఫిజి, మలేషియా, నెదర్లాండ్స్, ఒమన్
- ఫూల్ బీ (Pool B)- సౌతాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా, ఆస్ట్రేలియా
- ఫూల్ సీ (Pool C)- భారత్, నమీబియా, పోలాండ్, యానైటెడ్ స్టేట్స్
- ఫూల్ డీ (Pool D)- న్యూజిలాండ్, పరాగ్వే, థాయ్‌లాండ్, ఉరుగ్వే
పురుషుల జట్టు
- సిమ్రన్‌జీత్ సింగ్- కెప్టెన్
- మన్దీప్ మోర్- వైస్ కెప్టెన్- డిఫెండర్
- సురజ్ కర్కేరా- గోల్ కీపర్
- ప్రశాంత్ కుమార్ చౌహాన్- గోల్ కీపర్
- మన్జీత్- డిఫెండర్
- మహ్మద్ రహీల్ మౌసీన్- మిడ్ ఫీల్డర్
- మనీందర్ సింగ్- మిడ్ ఫీల్డర్
- పవన్ రాజ్‌భర్- ఫార్వడ్స్
- గుర్జోత్ సింగ్- ఫార్వడ్స్
- ఉత్తమ్ సింగ్- ఫార్వడ్స్
అటు పురుషుల జట్టు కూడా బలంగానే ఉంది. ఒలింపిక్స్ కాంస్య విజేత సిమ్రన్‌జీత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. టోర్నీలో భారత్ ఫూల్ బీ (Pool B)లో ఉండనుంది. ఈ పూల్‌లో భారత్‌తోపాటు ఈజిప్ట్, జమైకా, స్విట్జర్లాండ్ జట్లు ఉన్నాయి. 'జట్టులో ఇదివరకే మెగా ఈవెంట్లో ఆడిన అనుభవం ఉంది. జట్టు కూడా బ్యాలెన్స్‌గా ఉంది. ఈ టోర్నీ కోసం చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. వరల్డ్‌కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం'అని పురుషుల జట్టు కోచ్ సర్దార్ సింగ్ అన్నారు.
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
హోరాహోరీ మ్యాచ్‌లో పరాజయం.. హాకీ వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్