పోలెండ్ వేదికగా మే 1, 2 తేదీల్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌లో పాల్గొనే భారత మహిళల 4×100 మీటర్ల రిలే జట్టులో స్టార్ అథ్లెట్లు హిమదాస్, ద్యుతిచంద్ చోటు సాధించారు. గత నెల ఫెడరేషన్ కప్‌లో 100 మీ పరుగు ఫైనల్లో ద్యుతీని ఓడించిన ధనలక్ష్మితో పాటు అర్చన సుశీంద్రన్, హిమశ్రీ రాయ్, ఏటీ ధనేశ్వరీ ఈ జట్టులో ఉన్నారు.
పురుషులు 4×400 మీ, మహిళలు 4×400 మీటర్ల రిలేల్లోనూ భారత్ పోటీపడుతోంది. పురుషుల జట్టులో జాకబ్, నాగనాథన్, మహ్మద్ అనాస్, రాజీవ్, సార్థక్, ధరుణ్, నిర్మల్ తోమ్ ఉండగా.. మహిళల రిలేలో పూవమ్మ, శుభ, అంజలి దేవి, రేవతి, విస్మయ, జిస్నా మాథ్యూ, కిరణ్ ఉన్నారు.
రిలేల్లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. 2019 దోహాలో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరడం ద్వారా 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే జట్టు ఇప్పటికే టోక్యో బెర్తు సాధించింది.