Saudi Arabian Grand Prix: ఏడు సార్లు ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) ఈ ఏడాది కూడా టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. ఆదివారం సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిలో ఈ మెర్సిడెజ్ రేసర్ విజేతగా నిలిచాడు. 2 గంటల 6 నిమిషాల 15.118 సెకన్లలో అతను రేసు ముగించాడు. వెర్‌స్టాపెన్ (బెల్జియం) రెండో స్థానంలో నిలిచాడు.
Abu Dhabi Grand Prix: ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పాయింట్లలో అగ్రస్థానంలో ఉన్న రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్‌ను హామిల్టన్ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు రేసర్లు చెరో 369.5 పాయింట్లతో ఉన్నారు. వచ్చే ఆదివారం జరిగే ఈ సీజన్లో చివరిదైన అబుదాబి గ్రాండ్ ప్రిలో ఈ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలిస్తే వారే ప్రపంచ ఛాంపియన్ అవుతారు.
ఇప్పటికే అత్యధిక ప్రపంచ ఛాంపియన్ టైటిళ్లలో దిగ్గజ రేసర్ షుమాకర్ (7)తో సమంగా ఉన్న హామిల్టన్.. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఛాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో ఉన్నాడు. అలాగే, తొలి టైటిల్‌పై కన్నేసిన వెర్‌స్టాపెన్ ఈ సీజన్‌లో గొప్పగా రాణిస్తున్నాడు. ఇప్పటికీ రేసు విజయాల్లో 9-8తో హామిల్టన్‌పై అతనిదే పైచేయి. మరి చివరి రేసులో గెలిచి ట్రోఫీని ముద్దాడేది ఎవరో చూడాలి.