ETV Bharat / sports

'వింటర్ గేమ్స్​కు గుల్​మర్గ్​ అంతర్జాతీయ గమ్యస్థానం' - శీతాకాల క్రీడలు

శీతాకాల క్రీడలకు భవిష్యత్తులో కశ్మీర్​లోని గుల్​మర్గ్ అంతర్జాతీయ గమ్యస్థానం కానుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. రెండో ఎడిషన్ 'ఖేలో ఇండియా' వింటర్ గేమ్స్​ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Gulmarg will be an international destination for Winter Sports: Kiren Rijiju
'వింటర్ గేమ్స్​కు గుల్​మర్గ్​ అంతర్జాతీయ గమ్యస్థానం!'
author img

By

Published : Feb 26, 2021, 11:30 AM IST

వింటర్​ గేమ్స్​ కోసం భవిష్యత్తులో గుల్​మర్గ్​ అంతర్జాతీయ గమ్యస్థానం కానుందని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఖేలో ఇండియా జాతీయ పోటీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్​గా ప్రారంభించడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"శీతాకాల క్రీడల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. సంయుక్తంగా వీటిని జరపడానికి జమ్ముకశ్మీర్​ క్రీడల మండలి, క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్సాహంగా ఉన్నాయి. వింటర్ గేమ్స్​ కోసం క్రీడాకారులు బాగా సన్నద్ధమయ్యారు. గుల్​మర్గ్​ సహా హిమాలయ ప్రాంతాలకు వీటిని నిర్వహించే శక్తి ఉంది. అందుకు వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. శీతాకాల క్రీడల నిర్వహణకు భవిష్యత్తులో గుల్​మర్గ్ అంతర్జాతీయ గమ్యస్థానం కానుంది. అందుకోసం కృషి చేస్తున్నాం."

- కిరణ్ రిజుజు, కేంద్ర క్రీడల మంత్రి

శుక్రవారం ఉదయం 11:50 గంటలకు కశ్మీర్​లో రెండో ఎడిషన్ ఖేలో ఇండియా వింటర్​ గేమ్స్​ ప్రారంభంకానున్నాయి. ఆల్పైన్ స్కీయింగ్, నోర్డిక్ స్కీ, స్నో బోర్డింగ్​, పర్వతారోహణ, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్ తదితర క్రీడల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జట్లు పాల్గొననున్నాయి.

ఇదీ చూడండి: 'ఖేలో ఇండియా​'కు ముందు స్కీయర్ల విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.