ఐబా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో (Boxing World Championships) భారత యువ బాక్సర్ ఆకాశ్ కుమార్ (54 కేజీ) పోరాటం ముగిసింది. బెల్గ్రేడ్లో గురువారం జరిగిన సెమీఫైనల్లో కజికిస్థాన్కు చెందిన మఖ్మూద్ సబీర్ఖాన్ చేతిలో 0-5 తేడాతో ఘోర పరాజయం చవిచూశాడు. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నడు ఆకాశ్ (Akash Kumar Boxer).
21 ఏళ్ల ఆకాశ్.. ఈ టోర్నమెంట్లో భారత్ తరఫున పతకం సాధించిన ఏడో బాక్సర్. కాంస్యంతో పాటు 25 వేల డాలర్లు (సుమారు రూ.18.6 లక్షలు) ప్రైజ్మనీ దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి: 'బాక్సింగ్'తో పేదరికంపై విజేందర్ పోరాటం