దేశవాళీ క్రీడగా పేరొందిన కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తగిన కృషి చేస్తోందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. గురువారం లోక్‌సభ కొశ్చన్ అవర్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
"ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2,880 మంది క్రీడాకారులను ఎంపిక చేశాం. జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో పాల్గొనేందుకు వీరికి తగిన శిక్షణ అందిస్తాం. క్రీడలు రాష్ట్ర జాబితాలో ఉండటం వల్ల.. దానికి కావాల్సిన ప్రచారాన్ని కల్పించటంతో సహా క్రీడాకారులను గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే."
- కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి
ఖేలో ఇండియా పథకం.. క్రీడాస్ఫూర్తిని వెలికి తీయటం, వారిని ప్రోత్సహించటం ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆటల్లో నూతన మెలకువలు నేర్పించడమూ జరుగుతుందని రిజిజు తెలిపారు.
ఇదీ చూడండి.. ఐపీఎల్ రద్దయితే తీవ్రంగా నష్టపోతాం: ఫించ్