భారత్ తరఫున 67వ చెస్ గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు 14 ఏళ్ల లియోన్ మెండోన్కా. ఇటలీలో ఫైనల్ నార్మ్ దక్కించుకొని అతడు ఈ ఘనత సాధించాడు. గోవాకు చెందిన మెండోన్కా.. 14ఏళ్ల 9నెలల 17రోజుల్లోనే ఈ ఫీట్‌ను సాధించడం విశేషం.
హోదా పట్ల హర్షం వ్యక్తం చేశాడు మెండోన్కా. కష్టకాలంలో తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపాడు.
"గ్రాండ్‌మాస్టర్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో కృషి చేశాక ఈ విజయం దక్కింది. తల్లిదండ్రులు, కోచ్, స్పాన్సర్లు, చాలామందికి కృతజ్ఞతలు."
- లియోన్ మెండోన్కా, గ్రాండ్‌మాస్టర్ విజేత
కరోనా లాక్డౌన్ కారణంగా మార్చిలో ఐరోపాలో చిక్కుకుపోయారు మెండోన్కా, అతడి తండ్రి లిండన్. దీన్ని అవకాశంగా మలచుకోవాలని భావించారు. గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలవాలనే లక్ష్యంతో మార్చి నుంచి డిసెంబర్ వరకు 16టోర్నమెంట్లలో పాల్గొన్నాడు మెండోన్కా. తన రేటింగ్‌ను2452 నుంచి 2544కు పెంచుకున్నాడు.
అంతకుముందు చెన్నైకి చెందిన ఆకాశ్.. ఈ ఏడాది జులైలో 66వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.
ఇదీ చూడండి: రోహిత్‌తో మయాంక్ ఓపెనింగ్.. మిడిల్ఆర్డర్కు గిల్