ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. అదిరే ప్రదర్శనతో పసిడి పంట పండించారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో నెగ్గి ఏకంగా ఏడు స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. మహిళల విభాగంలో ఫైనల్ చేరిన వారందరూ విజేతలుగా నిలిచారు.
గీతిక (48కేజీ), బేబీరోజిసనా (51కేజీ), పూనమ్ (57కేజీ), వింకా (60కేజీ), అరుంధతి చౌదరి (69కేజీ), సనామచు చాను (75కేజీ), అల్ఫియా పఠాన్ (+81కేజీ) తమ తమ విభాగాల్లో నెగ్గారు.
ఫైనల్స్‌లో గీతిక 5-0తో కుజెస్కా (పోలెండ్)పై, బేబీరోజిసనా 5-0తో లింకోవా (రష్యా)పై, పూనమ్ 5-0తో గ్రోషీ (ఫ్రాన్స్)పై గెలిచారు. వింకా.. కజకిస్థాన్‌కు చెందిన షయక్మెతోవాను ఓడించింది. అరుంధతి 5-0తో బార్బరా (పోలెండ్)పై, అల్ఫియా 5-0తో కొజోరెజ్ (మాల్దోవా)పై నెగ్గింది.
ఇక సనామచు చాను కజకిస్థాన్ అమ్మాయి డానా డిడేను మట్టికరిపించింది. ప్రపంచ యువ బాక్సింగ్ మహిళల విభాగంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2017లో ఐదు స్వర్ణాలతో సాధించిన రికార్డును అధిగమించింది.
ఈ టోర్నీలో మరో భారత బాక్సర్ ఫైనల్లో పోటీపడాల్సివుంది. పురుషుల విభాగంలో సచిన్ (56 కేజీ) శుక్రవారం బరిలో దిగనున్నాడు.
ఇదీ చూడండి.. బాక్సింగ్‌లో భారత్ జోరు.. ఫైనల్స్‌కు ఎనిమిది మంది